తెలంగాణ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య సూసైడ్‌.. ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణం

తెలంగాణ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య సూసైడ్‌.. ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణం

కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. అల్వాల్ పంచశీల కాలనీలోని ఇంట్లో గురువారం రాత్రి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. గత 12 సంవత్సరాల క్రితం రూపదేవిని ప్రేమించి వివాహం చేసుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి మధ్య మనస్పర్థలు ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతుంది. రూపాదేవి మేడ్చల్ మునిరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాల..

కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. అల్వాల్ పంచశీల కాలనీలోని ఇంట్లో గురువారం రాత్రి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. గత 12 సంవత్సరాల క్రితం రూపదేవిని ప్రేమించి వివాహం చేసుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.. భార్య రూపాదేవి మధ్య మనస్పర్థలు ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతుంది. రూపాదేవి మేడ్చల్ మునిరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.

గత సంవత్సర కాలంగా కొంపల్లిలో పేట్ బషీరాబాద్ లోని దవేరియా విల్లాస్ లోని నివాసం ఉండేవారు. అయితే గత నెల రోజుల క్రితమే హైదరాబాద్‌, అల్వాల్ లోని పంచశీల కాలనీ రోడ్ నెంబర్ 12కి షిఫ్ట్‌ అయ్యారు. ఎమ్మెల్యే సత్యం- రూపదేవికి ఇద్దరు పిల్లలు. కుమారుడు యోజిత్ (11 ) , కుమార్తె రిషిక శ్రీ (9). గత కొంతకాలంగా ఎమ్మెల్యే దంపతుల మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. రూపాదేవి తాను చనిపోతున్నట్లు వీడియో కాల్ చేసి ఎమ్మెల్యే సత్యంకు చెప్పగా.. ఆయన వెంటనే చొప్పదండి నుంచి కారులో హైదరాబాద్ కు బయలుదేరారు. అయితే ఆల్వాల్ చేరుకునేలోగానే రూపాదేవి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి సమీపంలో ఉన్న లేనివో ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయారని వైద్యులు తెలిపారు.

భార్య మృతిని తట్టుకోలేక ఎమ్మెల్యే సత్యం హాస్పటల్లో స్పృహ తప్పి పడిపోయారు. కొంపెల్లిలోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో ఉన్న ఎమ్మెల్యేని మేడిపల్లి సత్యాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి మృతదేహాన్ని ఈరోజు ఉదయం తరలిస్తారు. ఆమె బలవన్మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు