తిరుమలలో వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీ

తిరుమలలో వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీ

చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తన ఫ్యామిలీతో కలిసి తిరుపతి వెళ్లారు. రేణిగుంట ఎయిర్​పోర్ట్‌‌కు చేరుకున్న వివేక్ వెంకటస్వామి, ఆయన కొడుకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కాకా అభిమానులు, దళిత నాయకులు మల్లారపు మధు, నాగరాజు గౌడ్  ఘన స్వాగతం పలికారు. ఇద్దరిని గజమాలతో ఘనంగా సన్మానించారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి భారీ మెజార్టీతో వంశీకృష్ణ ఘన విజయం సాధించారు. శనివారం వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణ తమ ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు