స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా? కేంద్రమంత్రి పర్యటన ఉద్దేశం ఏంటి?

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా? కేంద్రమంత్రి పర్యటన ఉద్దేశం ఏంటి?

మూడు సంవత్సరాలకు పైగా పోరాటం చేస్తున్న కార్మికులతో పాటు.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించిన ఆంధ్రప్రదేశ్ అభిమానులందరికీ సంతోషం కలిగించే వార్త రాబోతోందా? విశాఖ స్టీల్ ప్లాంట్‎ని ప్రైవేట్ పెట్టుబడుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించబోతుందా? కేంద్ర ఉక్కు మంత్రి హెచ్ డి కుమారస్వామి నేడు, రేపు విశాఖ పర్యటన అందుకోసమేనా? పూర్తిస్థాయి ఉత్పత్తికి అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడంతో పాటు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చేసిన సెయిల్‎లో విలీనం ప్రతిపాదన చర్చకు రాబోతోందా? ఒక పర్యటన 100 సమాధానాల కోసం ఎదురుచూస్తోంది.

నేడు విశాఖకు కేంద్ర స్టీల్ మినిస్టర్ హెచ్ డీ కుమారస్వామి రాబోతున్నారు. స్టీల్ ప్లాంట్‎లోనే బస చేయబోతున్నారు. రేపు ఉన్నతాధికారులు, కార్మిక సంఘాలతో సమావేశం కాబోతున్నారు. పూర్తి స్థాయి ఉత్పత్తికి వర్కింగ్ క్యాపిటల్ లేక నష్టాల ఊబిలో ఉన్న స్టీల్ ప్లాంట్‎ను సెయిల్‎లో విలీనం చేయాలని విజ్ఙప్తి చేశారు ఏపీ ఎంపీలు. ఇటీవల రాష్ట్ర బీజేపీ ఎంపీలు కుమార స్వామికి విజ్ఞప్తి చేసిన మేరకే కేంద్ర మంత్రి పర్యటన సాగుతోందా?

నిర్వహణా నిధులు లేక తగ్గిన ఉత్పత్తి..
మూడేళ్ల క్రితం పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆందోళనకు గురి చేసింది. ఉద్యోగులు అప్పటినుంచీ వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నారు. గత మూడేళ్లుగా నిర్వహణా నిధులు లేక 60 శాతం ఉత్పత్తే వస్తోంది. తగినంత వర్కింగ్ క్యాపిటల్ లేక రూ. 20 వేల కోట్ల విలువైన మెషినరీ నిరుపయోగంగా ఉంది. 2022 నుంచి ఒక బ్లాస్ట్ఫర్నేస్-3 ఆపేయడంతో రెండున్నర మిలియన్ టన్నుల ఉత్పత్తి నిలిచిపోయింది. వైజాగ్ స్టీల్స్‎కే చెందిన రాయబరేలి ఫోర్జ్ వీల్ ప్లాంటును రూ.2వేల కోట్లకు అమ్మినా అవి ఎందుకూ ఉపయోగపడలేదు. విశాఖలో ప్లాంట్‎కు ఉన్న విలువైన 25 ఎకరాల స్థలాలను ప్లాట్లుగా వేసి అమ్మకానికి పెట్టారు. వీటిపై కోర్టులో స్టే ఉంది. కానీ తాజాగా చెన్నై, హైదరాబాద్‎ని స్టీల్ స్టాక్ పాయింట్లతో పాటు, వివిధ నగరాల్లోని కార్యాలయ భవనాలను 500 కోట్లకు అమ్మేందుకు ప్రతిపాదించారు. ఈ దశలో మోడీ 3.0 ప్రభుత్వం తాజా రాజకీయ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో చూడాలి.

ఆశల పల్లకిలో..
విశాఖ స్టీల్ భవిష్యత్తుపై సరికొత్త ఆశలు చిగురిస్తునాయి. మూడు సంవత్సరాలకు పైగా ఉద్యోగుల ఆందోళన, జీతాలు సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి, మేయింటనన్స్ కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఉన్న ఉక్కు ప్లాంట్‎కి కేంద్ర స్టీల్ మంత్రి కుమారస్వామి ఈ సాయంత్రం వస్తున్నారు. ఉన్నతాధికారులు, రేపు కార్మిక నేతలతో సమావేశం కానున్నారు. కేంద్ర మంత్రి హోదాలో వస్తున్న నేపథ్యంలో మంత్రి ఏం చెబుతారు? సెయిల్లో విలీన ప్రతిపాదనపై ఎలా స్పందిస్తారనేది చాలా ఆసక్తిగా మారింది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు