ప్రయాణీకులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్.. ఇది చూస్తే ఫుల్ ఖుషీగా జర్నీ చేస్తారంతే.!

ప్రయాణీకులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్.. ఇది చూస్తే ఫుల్ ఖుషీగా జర్నీ చేస్తారంతే.!

ప్రయాణీకులకు TGSRTC గుడ్‌న్యూస్ అందించింది. ఇకపై టికెట్ల కోసం ప్రయాణీకులు చిల్లర విషయంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. చేతి నిండా నగదు లేకపోయినా.. ఆర్టీసీ బస్సుల్లో ఇకపై ఫుల్ ఖుషీగా జర్నీ చేసేయొచ్చు. మరికొద్ది రోజుల్లో నగర వ్యాప్తంగా..

ప్రయాణీకులకు TGSRTC గుడ్‌న్యూస్ అందించింది. ఇకపై టికెట్ల కోసం ప్రయాణీకులు చిల్లర విషయంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. చేతి నిండా నగదు లేకపోయినా.. ఆర్టీసీ బస్సుల్లో ఇకపై ఫుల్ ఖుషీగా జర్నీ చేసేయొచ్చు. మరికొద్ది రోజుల్లో నగర వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది టీజీఎస్ఆర్టీసీ. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, డెబిట్‌, క్రెడిట్‌ కార్డు స్వైపింగ్‌ లాంటి డిజిటల్ పేమెంట్స్ ద్వారా టికెట్లు జారీ చేయనున్నారు ఆర్టీసీ అధికారులు.

ఇదిలా ఉండగా.. ప్రతీ రోజూ నగర వ్యాప్తంగా వేలాది మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. దీంతో వారందరికీ మెరుగైన సేవలు అందించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అటు రాష్ట్రంలో మహాలక్ష్మీ పధకం అమలులోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో టికెట్ల జారీ విషయంలో అటు కండక్టర్లకు, ఇటు ప్రయాణీకులకు చిల్లర ఇబ్బందులు తప్పట్లేదు. అందుకే ఆన్‌లైన్‌ చెల్లింపులను ప్రోత్సహించి టికెట్లు జారీ చేయాలని ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఇందులో భాగంగానే పైలెట్ ప్రాజెక్ట్‌గా బండ్లగూడ పరిధిలోని 70 బస్సుల్లో టికెట్ల జారీ యంత్రాలను కండక్టర్లకు అందించారు ఆర్టీసీ అధికారులు. గడిచిన 20 రోజులుగా ఈ ప్రాజెక్ట్ కొనసాగుతోంది. డిజిటల్ చెల్లింపుల ద్వారా టికెట్ల జారీ ప్రక్రియ విషయంలో సాధ్యాసాధ్యాలు, యంత్రాల పనితీరు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడంలో లోపాలు లాంటి సమస్యలపై ఆర్టీసీ స్టడీ చేసింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవడంతో తదుపరి ప్లాన్ సిద్దం చేసి.. నగరవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను ప్రారంభించేందుకు రెడీ అయింది టీజీఎస్‌ఆర్టీసీ.

Please follow and like us:
తెలంగాణ వార్తలు