బుర్ఖాతో ఒకరు.. హెల్మెట్ ధరించి మరొకరు గోల్డ్ షాపులోకి వచ్చారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

బుర్ఖాతో ఒకరు.. హెల్మెట్ ధరించి మరొకరు గోల్డ్ షాపులోకి వచ్చారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

అసలే.. గోల్డ్ షాప్.. రోజూ పదుల సంఖ్యలో కస్టమర్లు వచ్చిపోతుంటారు.. నగలు కొనే వారితో.. వచ్చి పోయే వాహనాలతో ఆ ప్రాంతం ఎప్పుడూ బిజీగానే ఉంటుంది.. ఈ క్రమంలోనే షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.. కస్టమర్లు లాగా ఒకరు బుర్ఖా ధరించి రాగా.. మరొకరు హెల్మెట్ పెట్టుకోని షాపులోకి ప్రవేశించారు.. చూస్తుండగానే.. బుర్ఖా ధరించి వచ్చిన వ్యక్తి.. తన వెంట తెచ్చుకున్న కత్తితో షాపు యజమానిపై దాడి చేశాడు..

అసలే.. గోల్డ్ షాప్.. రోజూ పదుల సంఖ్యలో కస్టమర్లు వచ్చిపోతుంటారు.. నగలు కొనే వారితో.. వచ్చి పోయే వాహనాలతో ఆ ప్రాంతం ఎప్పుడూ బిజీగానే ఉంటుంది.. ఈ క్రమంలోనే షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.. కస్టమర్లు లాగా ఒకరు బుర్ఖా ధరించి రాగా.. మరొకరు హెల్మెట్ పెట్టుకొని షాపులోకి ప్రవేశించారు.. చూస్తుండగానే.. బుర్ఖా ధరించి వచ్చిన వ్యక్తి.. తన వెంట తెచ్చుకున్న కత్తితో షాపు యజమానిపై దాడి చేశాడు.. అసలేం జరుగుతుందో.. ఏం అర్ధం కాలేదు.. చివరకు చాకచక్యంగా షాపు యజమాని వారి బారి నుంచి తప్పించుకున్నాడు.. ఈ షాకింగ్ ఘటన మేడ్చల్ పట్టణంలో చోటుచేసుకుంది. పట్టపగలే జ్యూయలరీ షాప్ యజమానిపై దుండగులు కత్తితో దాడి చేసి డబ్బులు తీసుకుని పారిపోయారు..

అసలేం జరిగిందంటే..
మేడ్చల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని జగదాంబ జ్యూవెల్లరి షాప్ యజమాని శేషారంపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేసి దొంగతనానికి పాల్పడి పారిపోయారు. మధ్యాహ్నం సమయంలో పల్సర్ బైక్ మీద వచ్చారు ఇద్దరు దుండగులు.. ఒకరు బుర్ఖాలో రాగా.. మరొకరు హెల్మెట్ తో షాపులోకి ప్రవేశించారు. వచ్చి రాగానే.. చాకుతో షాప్ యజమాని శేషరాంను పొడిచాడు.. ఆ తర్వాత.. ఇద్దరూ కలిసి డబ్బులు ఎత్తుకెళ్లారు.

ఈ ఘటన జరిగిన సమయంలో శేషారంతోపాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు.. కత్తి బయటకు తీయగానే అతను లోపలికి వెళ్లి తలుపువేసుకున్నాడు.. ఈ సమయంలో శేషారం దుండగులను ప్రతిఘటించి తృటిలో తప్పించుకున్నాడు.. కాగా.. ప్రస్తుతం షాపు యజమాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు