తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన టెట్‌.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ

తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన టెట్‌.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ

వచ్చే నెల 2 వరకూ కంప్యూటర్‌ బేస్డ్‌గా పరీక్ష

రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ

గంటన్నర ముందే హాల్లోకి అనుమతి.. ఒక్క నిమిషం నిబంధన అమలు

రాష్ట్రవ్యాప్తంగా 80 కేంద్రాలు.. పరీక్ష రాయనున్న 2.86 లక్షల మంది అభ్యర్థులు

తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్‌ టెట్‌) సోమవారం ఉదయం ప్రారంభమైంది. పూర్తిగా కంప్యూటర్‌ బేస్డ్‌గా.. రోజుకు రెండు సెషన్లు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఇంకో సెషన్‌లో పరీక్ష జరగనుంది.

వచ్చే నెల 2వ తేదీ వరకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 80 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో గ్రేటర్‌ హైద­రా­బాద్‌ పరిధిలోనే 42 కేంద్రాలు ఉన్నాయి. ఈసారి కొత్తగా బయోమెట్రిక్‌ హాజరును ప్రవేశపెట్టారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గంటన్నర ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేయాలని ఆదేశాలిచ్చారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి సొంత ప్రాంతాల్లోనే పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు