ఆ థియేటర్లలో బొమ్మ పడదు

ఆ థియేటర్లలో బొమ్మ పడదు

థియేటర్ల మూసివేత విషయం ఎగ్జిబిటర్ల అసోసియేషన్‌ సమష్టి నిర్ణయం కాదని… నష్టాలను మూటకట్టుకోవడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నామని సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల యజమానులు చెబుతున్నారు. కొత్త సినిమాలు వచ్చేవరకు అంటే…శుక్రవారం నుంచి కనీసం పదిరోజులపాటు ఏ బొమ్మా పడదు. జనవరి తర్వాత జూన్‌ వరకు పెద్ద హీరోల సినిమాలు ఒక్కటి కూడా విడు­దల కావడం లేదని, చిన్న సినిమాలు వచ్చినా.. అవి ప్రేక్షక ఆదరణ లేని కారణంగా రోజు అయ్యే వ్యయంలో కనీసం పదిశాతం ఆదాయం కూడా రావడం లేదని ఎగ్జిబిటర్‌ చారి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు.

రెండువారాలపాటు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో సినిమాల ప్రదర్శన నిలిపివేయాలన్న నిర్ణయంతో తెలంగాణ స్టేట్‌ ఫిలిం చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌కు ఎలాంటి సంబంధం లేదని అధ్యక్షుడు సునీల్‌నారంగ్, కార్యదర్శి కె.అనుపమ్‌రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణ, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో థియేట­ర్లలో సినిమాల ప్రదర్శన నిలిపివేయాలన్న నిర్ణయానికి చిత్ర పరిశ్రమ అపెక్స్‌బాడీలైన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలికి గాని ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని చలనచిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్‌ తెలిపారు. ప్రేక్షకులు లేని కారణంగా ప్రదర్శనలు రద్దు చేయడమైందని గతంలోనూ బోర్డులు పెట్టేవారని ఆయన గుర్తు చేశారు.

Please follow and like us:
సినిమా వార్తలు