ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి.. విగతజీవిగా మారాడు.. పోలీసుల ఆరాతో అసలు నిజం..!

ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి.. విగతజీవిగా మారాడు.. పోలీసుల ఆరాతో అసలు నిజం..!

హైదరాబాద్ పాతబస్తీలో అర్థరాత్రి మరో హత్య కలకలం రేపింది. పాతబస్తీ దాని పరిసర ప్రాంతాల్లో వరుస హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. పాతబస్తీలో వరుస హత్యలు దాడులు జరిగి 24 గంటలు గడవక ముందే మరొక హత్య వెలుగులోకి రావటం వణుకు పుట్టిస్తోంది.

హైదరాబాద్ పాతబస్తీలో అర్థరాత్రి మరో హత్య కలకలం రేపింది. పాతబస్తీ దాని పరిసర ప్రాంతాల్లో వరుస హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. పాతబస్తీలో వరుస హత్యలు దాడులు జరిగి 24 గంటలు గడవక ముందే మరొక హత్య వెలుగులోకి రావటం వణుకు పుట్టిస్తోంది. హైదరాబాద్ పాతబస్తీలోని నవాబ్ సాబ్ కుంట పరిధిలోని అచ్చిరెడ్డి నగర్ లోని ఒక ఇంట్లో మొహమ్మద్ జాకీర్ హుస్సేన్ అనే వ్యక్తి అత్యంత పాశవికంగా హత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అచ్చిరెడ్డినగర్ లో జాకీర్ హుస్సేన్ అనే వ్యక్తి తెలిసిన బంధువుల ఇంటికి వెళ్లగా, హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. జాకీర్ హుస్సేన్ ను బండరాయితో కొట్టి చంపినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని క్లూస్ టీమ్ సహాయంతో దర్యాప్తు చేపట్టారు. అయితే ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని అనుమానిస్తున్నారు. గత కొన్ని రోజులుగా వివిధ ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళ పోలీస్ పెట్రోలింగ్ ఉన్నా నేరాలు జరుగుతున్నాయని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నేరస్థులపై నిఘా తగ్గిపోవడం, అర్ధరాత్రి వేళ పోలీస్ పెట్రోల్ వ్యవస్థ నిస్సారంగా మారడంతో నేరాలు ఎక్కువ అయ్యాయని విమర్శలు వినిపిస్తున్నాయి.

Please follow and like us:
తెలంగాణ వార్తలు