రైతులకు బిగ్ అలర్ట్.. ఇకపై అలాంటి వారికే ‘రైతు భరోసా పథకం’..! వారికి లేనట్టేనట..

రైతులకు బిగ్ అలర్ట్.. ఇకపై అలాంటి వారికే ‘రైతు భరోసా పథకం’..! వారికి లేనట్టేనట..

తెలంగాణలో కీలకమైన పథకం అమలు విషయంలో డబ్బు వృధా కాకుండా కాంగ్రెస్‌ సర్కార్‌ ప్లాన్‌ చేస్తోంది. రైతు భరోసా నిధులు పక్కదారి పట్టకుండా మార్గదర్శకాలు రెడీ చేసింది.

ఏ పథకమైనా అర్హులకు మాత్రమే అందాలనే ఉద్దేశ్యంతో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం నిధులు పక్కదారి పట్టాయి అంటున్న కాంగ్రెస్ నేతలు.. రైతు భరోసా పథకాన్ని మాత్రం. అలా నీరు గార్చే ప్రసక్తే లేదంటున్నారు. అనర్హులను ఏరివేసి.. నిజమైన రైతులకే దాన్ని అమలుచేస్తామంటోంది. పూర్త పారదర్శకంగా ఈ స్కీమ్ అమలుచేస్తామని ప్రభుత్వం వెల్లడిచింది. ఈ స్కీమ్‌కి సంబంధించి ప్రభుత్వం.. గ్రామాల వారీగా సాగు భూమి ఎంత? రియల్ ఎస్టేట్ భూములు ఎన్ని ఉన్నాయి? కొండలు, గుట్టలు ఎన్ని ఉన్నాయి? సాగులో లేని దేవాదాయ, వక్ఫ్‌ భూములు ఎన్ని ఉన్నాయి? ఈ వివరాలు సేకరించేందుకు వ్యవసాయశాఖ పూర్తిస్థాయిలో సర్వే చేస్తుంది.

గతంలో పాస్ బుక్లో ఉన్న భూమికి రైతు భరోసా ఇచ్చేవారు. పంటలు వేసినా.. వేయకపోయినా.. డబ్బులు అకౌంట్లలో వేసేవారు. కానీ.. ఇప్పుడు అధికారులు ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు. రైతుకు ఉన్న భూమి ఎంత? ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారో సర్వే చేస్తారు. లెక్కల ఆధారంగా రైతుభరోసాపై అంచనాకు వస్తారు. ఎన్ని ఎకరాల్లో పంటలు పండిస్తే.. అంతవరకే రైతు భరోసా చెల్లిస్తారు.

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో.. ప్రతి రైతుకూ ఎకరాకీ ఏడాదికి 10 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ 5 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. రైతులకు, కౌలురైతులకు కూడా సంవత్సరానికి ఎకరాకి 15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలిపింది.
ఇక కొత్త మార్గదర్శకాల అంచనాల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులు, ప్రజాప్రతినిధులు, బడా వ్యాపార వేత్తలకు ఈ పథకం వర్తించదు. అలాగే బీడుభూములు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఈ నిధులు ఇవ్వరని పేర్కొంటున్నారు.. రైతు భరోసాని 5 ఎకరాల లోపు రైతులకు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఐదు ఎకరాలకంటే ఎక్కువ ఉన్న రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

అయితే.. రైతు భరోసా పథకం అమలుపై ప్రభుత్వం ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేయాల్సి ఉంది.. ఫీడ్ బ్యాక్ అనంతరం రైతు భరోసా అమలుపై ప్రకటన విడుదలవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు