ఆంధ్రప్రదేశ్ గెలిచింది.. ప్రజలు గెలిచారు.. నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది..

ఆంధ్రప్రదేశ్ గెలిచింది.. ప్రజలు గెలిచారు.. నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది..

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, బీజేపీతో కలిసి తిరుగులేని విజయాన్ని అందుకుంది తెలుగుదేశం పార్టీ.. 11 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలు మినహా రాష్ట్రంలోని మిగతా ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను మొత్తం కైవసం చేసుకుంది కూటమి.. ఇక, ఈ అద్భుత విజయాన్ని అందించిన ఏపీ ప్రజలకు సోషల్‌ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… ‘ఆంధ్రప్రదేశ్ గెలిచింది.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిచారు.. ఇవాళ నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది.. అంటూ ట్విట్టర్‌ (ఎక్స్‌)లో రాసుకొచ్చారు చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్ గెలిచింది.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిచారు.. ఇవాళ నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది.. టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమికి సేవ చేసేందుకు అఖండమైన ఆదేశంతో ఆశీర్వదించినందుకు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు.. రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం జరిగిన యుద్దంలో గెలిచాం. కలిసికట్టుగా రాష్ట్ర పునర్ నిర్మాణం చేపడతాం. ఏపీ భవిష్యత్తు కోసం మేమున్నామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షా, జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. ఇక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి.. జనసేన, బీజేపీ శ్రేణులకు అభినందనలు తెలిపారు.. ఈ మహత్తర విజయం కూటమి నాయకులు, కార్యకర్తల కృషి, అంకితభావం వల్ల సాధ్యమైంది. చివరి ఓటేసే వరకు ధైర్యంగా పోరాడారు. కూటమి కాక్యకర్తలు, నేతల అచంచలమైన నిబద్ధతకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ అద్భుతమైన విజయానికి అభినందనలు.’ అంటూ ట్వీట్‌ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు