7వ తరగతి పిల్లలకు పాఠ్యాంశంగా తమన్నా జీవితం.. మండిపడుతున్న పేరెంట్స్

7వ తరగతి పిల్లలకు పాఠ్యాంశంగా తమన్నా జీవితం.. మండిపడుతున్న పేరెంట్స్

స్కూల్లో చదువుకునే పిల్లలకి ప్రముఖుల జీవితాలను పాఠ్యాంశంగా చెప్పడం సహజమే. దేశం కోసం పోరాడిన వారి జీవితాలు, శాస్త్రవేత్తల జీవితాలు ఇప్పటికే పాఠ్యాంశంగా ఉన్నాయి కూడా. అలా కాకుండా ఈ మధ్య సినిమా నటుల జీవితాలను కూడా పిల్లలకు పాఠాలుగా చెప్తున్నారు. తాజాగా ఇలాంటి పనిచేసిన బెంగళూరులోని హెబ్బళ సింధీ ఉన్నత పాఠశాలపై తీవ్ర విమర్శల తలెత్తుతున్నాయి. విద్యార్థుల పేరెంట్స్ పాఠశాలపై మండిపడుతున్నారు.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. బెంగళూరులోని హెబ్బళ సింధీ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి పిల్లలకు పాఠ్యాంశంగా సినీ నటీ తమన్నా జీవితాన్ని బోధిస్తున్నారు. దేశవిభజన అనంతరం సింధీకి చెందిన ప్రముఖుల గురించి చెప్పే విషయంలో తమన్నా, రణ్వీర్ సింగ్ వీరి గురించి చేర్చారు. ఇప్పుడు అదికాస్తా వివాదంగా మారింది. సింధీ వర్గంలో ఎంతోమంది ప్రముఖులు, కవులు, కళాకారులు ఉండగా.. సినిమా నటుల జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడమేంటని విద్యార్థుల పేరెంట్స్ ఫైర్ అవుతున్నారు. పాఠశాలకు వచ్చి గొడవ కూడా చేసారు.

అయితే ఈ విషయంపై స్పందించిన స్కూల్ యాజమాన్యం.. సింధీ వర్గానికి చెందిన తమన్నా అత్యున్నత స్థాయికి చేరడం, ఆ రంగంలో ఎన్నో విజయాలు సాధించడం వల్లనే అలా చేసాం అని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా రిజిస్టర్ కావడంతో విచారణ జరుగుతోంది.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు