రాంచరణ్ కు బిగ్ రిలీఫ్ ఇవ్వనున్న శంకర్..?

రాంచరణ్ కు బిగ్ రిలీఫ్ ఇవ్వనున్న శంకర్..?

రాంచరణ్ కు బిగ్ రిలీఫ్ ఇవ్వనున్న శంకర్
మరో పది రోజుల్లో గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి

గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “గేమ్ ఛేంజర్”..ఈసినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో నవీన్ చంద్ర ,సునీల్ ,సముద్రఖని వంటి తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.ఇదిలా ఉంటే షూటింగ్ ఎప్పుడో మొదలైంది కానీ ఇంకా పూర్తి కాలేదు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.దర్శకుడు శంకర్ ఇండియన్ 2 షూటింగ్ లో బిజీ గా ఉండటం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.ఈ సినిమాలో రాంచరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు.తండ్రి ,కొడుకుగా రాంచరణ్ నటిస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది.ఇటీవల రాజమండ్రి పరిసర ప్రాంతాలలో చిత్రీకరించిన చిత్ర యూనిట్ తాజాగా వైజాగ్ లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.మరో వారం లేదా పది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానున్నట్లు సమాచారం.దీనితో షూటింగ్ పూర్తయ్యాక ఫ్యామిలీ తో చరణ్ వెకేషన్ కు వెళ్లనున్నట్లు సమాచారం.తిరిగొచ్చిన వెంటనే బుచ్చి బాబు సినిమా మొదలు పెట్టనున్నట్లు తెలుస్తుంది.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు