మియాపూర్‌లో దారుణం.. జేఎస్‌ఆర్‌ కంపెనీ ఉద్యోగినిపై లైంగిక దాడి

మియాపూర్‌లో దారుణం.. జేఎస్‌ఆర్‌ కంపెనీ ఉద్యోగినిపై లైంగిక దాడి

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై సహోద్యోగులు అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి…

రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న సేల్స్ ఎగ్జిక్యూటివ్ లు సహా ఉద్యోగినిపై అత్యాచారం చేసిన ఘటన మియాపూర్ లో కలకలం రేపుతోంది. పొట్ట కూటికోసం కడప నుండి హైదరాబాద్‌కి వచ్చిన ఓయువతి.. ఉప్పల్ లో నివాసం ఉంటుంది. మియాపూర్ లోని jsr గ్రూప్ కంపెనీలో సేల్స్ ట్రైనీ గా ఉద్యోగంలో చేరింది యువతీ. అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న సంగారెడ్డి, జనార్దన్ అనే ఇద్దరు వ్యక్తులు ఆ యువతీపై కన్నేశారు. పక్కాగా వ్యహారచన చేసి సైట్ చూపిస్తామంటూ కారులో తీసుకెళ్లారు. యువతికి కుల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి లైంగిక దాడి చేసారు. యాదాద్రి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి కారు లోనే యువతిని రేప్ చేశారు. తర్వాత హాస్టల్ ముందు వదిలేసి వెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన జరిగిన రాత్రే యువతీ ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. జీరో ఎఫ్ ఐ ఆర్ కింద కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు కేసును అక్కడి నుండి మియాపూర్ కు కేసు బదిలీ చేసారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు సంగారెడ్డి, జనార్దన్ రెడ్డి ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.

రియల్ ఎస్టేట్ కంపనీలో పని చేస్తున్న మరో ఇద్దరు సేల్స్ ఎగ్జిగ్యుటివ్ సైతం యువతలను ఇలానే రేప్ చేస్తామని బెదిరించారని బాధితురాలు పోలీసుల వాగ్మూలంలో తెలిపింది. నిండితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కి తరలించారు. ఎంక్వైరీ చేస్తున్నారు

Please follow and like us:
తెలంగాణ వార్తలు