ఆ సినిమా కోసం రాంచరణ్ రెండు నెలలు స్పెషల్ ట్రైనింగ్..

ఆ సినిమా కోసం రాంచరణ్ రెండు నెలలు స్పెషల్ ట్రైనింగ్..

బుచ్చి బాబు మూవీ కోసం రాంచరణ్ రెండు నెలలు స్పెషల్ ట్రైనింగ్

ఆగష్టు లో సినిమా షూటింగ్ ప్రారంభం

గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్”..ఈసినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో నవీన్ చంద్ర ,సునీల్ ,సముద్రఖని వంటి తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాలో తండ్రి ,కొడుకుగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది కానీ ఇంకా పూర్తి కాలేదు.దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో పాల్గొనడంతో గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.మరో వారం పది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది.ఆ వెంటనే రాంచరణ్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లనున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత రాంచరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో సాగనున్నట్లు సమాచారం.దీనికోసం రాంచరణ్ ఆస్ట్రేలియా లో రెండు నెలలు స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నట్లు సమాచారం.అందుకే ఈ సినిమా షూటింగ్ ను ఆగస్టు లో ప్రారంభించేలా చూస్తున్నట్లు తెలుస్తుంది .ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు