కల్కి విధ్వంసం.. హైదరాబాద్‏లో మూడు చోట్ల సరికొత్త రికార్డులు.. ఆ విషయంలో ప్రభాస్ ఏకైక హీరో..

కల్కి విధ్వంసం.. హైదరాబాద్‏లో మూడు చోట్ల సరికొత్త రికార్డులు.. ఆ విషయంలో ప్రభాస్ ఏకైక హీరో..

ఇప్పటికే వరల్డ్ వైడ్ రూ.700 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అనేక చోట్ల పలు రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అమితాబ్, దిశా పటానీ, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన కల్కి 2898 ఏడి సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. జూన్ 27న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సునామి సృష్టిస్తుంది. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ కలెక్షన్స్ అదరగొడుతుంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ రూ.700 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అనేక చోట్ల పలు రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అమితాబ్, దిశా పటానీ, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్.. బిగ్‌ కాస్టింగ్‌తో రూపొందించిన మూవీ… సంచలనాలు నమోదు చేస్తోంది. తాజాగా కల్కి ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది.

పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా డార్లింగ్ సినిమా రిలీజ్ అంటే హైదరాబాద్ లో ఉండే హంగామా గురించి చెప్పక్కర్లేదు. సింగిల్ స్క్రీన్ నుంచి మల్టిప్లెక్స్ వరకు అన్ని థియేటర్స్ కళకళలాడతాయి. ఇక వీకెండ్ మూడు రోజులు అయితే హౌస్ ఫుల్ కావాల్సిందే. తాజాగా ప్రభాస్ నటించిన కల్కి సినిమాతో హైదరాబాద్ లోని మూడు మల్టీప్లెక్స్ థియేటర్స్ లో సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో మహేష్ బాబుకు సంబందించిన AMB సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్ లో మొత్తం 7 స్క్రీన్స్ ఉన్నాయి. కల్కి రిలీజ్ రోజున అన్ని స్క్రీన్స్ లో కలిపి మొత్తం 40 షోల వరకు వేసినట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం AMBలో రూ. కోటి వరకు గ్రాస్ కలెక్షన్స్ ఫాస్ట్ గా సాధించిన సినిమాగా కల్కి నిలిచింది. ఈ విషయాన్ని AMB స్వయంగా పోస్ట్ చేసింది. ఇప్పటివరకు AMBలో మహేష్ సినిమా కూడా ఇంత ఫాస్ట్ గా కోటి గ్రాస్ కలెక్ట్ చేయలేదు. దీంతో మహేష్ ఇలాకాలో ప్రభాస్ సరికొత్త రికార్డ్ అంటున్నారు.

అలాగే హైదరాబాద్ నల్లగండ్లలో ఇటీవలే అపర్ణ సినిమాస్ అనే మల్టీప్లెక్స్ థియేటర్ ప్రారంభించగా.. అక్కడ కూడా ఒక్కరోజే కల్కి సినిమా 42 షోలు వేయగా.. ఆల్మోస్ట్ అన్ని ఫుల్ అయ్యాయి. ఇక్కడ కూడా ఫస్ట్ టైం రూ. కోటి గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. ఐదు రోజుల్లోనే పది లక్షలు రాబట్టింది. ఇలాగే హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్లో కల్కి రిలీజ్ రోజున 36 షోలు వేయగా.. రూ.కోటి గ్రాస్ రాబట్టింది. ఇరవై ఏళ్లలో చాలా ఫాస్ట్ గా కోటి గ్రాస్ సాధించిన సినిమాగా కల్కి నిలిచింది. దీంతో హైదరాబాద్ లో మూడు చోట్ల కల్కి రికార్డులు సెట్ చేసిందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

Please follow and like us:
వార్తలు సినిమా