ప్రభాస్ దెబ్బకి రికార్డ్స్ బ్రేక్.. కల్కి ఫస్ట్ డే సూపర్ కలెక్షన్స్

ప్రభాస్ దెబ్బకి రికార్డ్స్ బ్రేక్.. కల్కి ఫస్ట్ డే సూపర్ కలెక్షన్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. హాలీవుడ్ రేంజ్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పట్టారు. విడుదలైన మొదట షో నుండే పాజిటీవ్ టాక్ రావడంతో.. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ రాబడుతోంది ఈ మూవీ. కల్కి సినిమా విషయంలో ట్రేడ్ వర్గాలు ముందుగా అంచనా వేసిన విదంగానే.. రికార్డ్ కలెక్షన్స్ రాబడుతోంది ఈ సినిమా.

ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం కల్కి సినిమా మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.180 కోట్లకు పైగా వసూళ్ళని రాబట్టినట్టు తెలుస్తోంది. అందుకే ఇండియాలో మొదటిరోజు రూ.90 కోట్ల నుండి రూ.110 కోట్ల వరకు రాబట్టిందని అంచనా వేస్తున్నారు. ఇక ఇండియా వైడ్ గా చూసుకుంటే ఇది మూడో హైయెస్ట్ గ్రాస్ అవడం విశేషం. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా మొదటిరోజు రూ.223 కోట్లు, బాహుబలి 2 రూ.217 కోట్లతో ఒకటి రెండు స్థానాల్లో నిలువగా.. ఇప్పుడు కల్కి రూ.180 కోట్లతో మూడవస్థానలో నిలిచి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక సినిమాకు యూనానిమస్ గా పాజిటీవ్ టాక్ రావడంతో.. రానున్న రోజుల్లో ఈ లెక్క భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా ఖచ్చితంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాదిస్తుందని అంచనా.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు