ఫ్యాన్స్ ను తెగ ఊరిస్తున్న ‘ఓజి’ ఫస్ట్ సింగిల్..?

ఫ్యాన్స్ ను తెగ ఊరిస్తున్న ‘ఓజి’ ఫస్ట్ సింగిల్..?

ఫ్యాన్స్ ను ఊరిస్తున్న ఓజి ఫస్ట్ సింగిల్
త్వరలోనే బిగ్ అనౌన్స్మెంట్


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మొన్నటి వరకు రాజకీయాలలో ఫుల్ బిజీ గా ఉండటంతో తన లైనప్ లో వున్న సినిమాల షూటింగ్స్ కు బ్రేక్ పడింది.అయితే పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఘన విజయం సాధించి డిప్యూటీ సీఎం కూడా అయ్యారు.ఇక నుంచి పవన్ సినిమాల సందడి షురూ కానుంది.ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి అనుకుంటున్నారు పవన్ కల్యాణ్ ..దీనితో తన లైనప్ లో వున్న సినిమాలను పూర్తి చేసేందుకు సిద్ధం అయ్యారు.ముందుగా ఎప్పటి నుంచో పెండింగ్ లో వున్న హరిహర వీరమల్లు షూటింగ్ లో పవన్ పాల్గొననున్నారు.ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది.ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేసందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే పవన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ఓజి”.పవన్ కల్యాణ్ డై హార్డ్ ఫ్యాన్ అయిన సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది .మరో ఇరవై రోజులు షూటింగ్ చేస్తే ఈ సినిమా పూర్తి అవుతుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ ,గ్లింప్సె ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.అయితే ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ఫ్యాన్స్ తెగ వూరిస్తుంది.థమన్ ఆల్రెడీ ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ రెడీ చేసాడని సమాచారం.త్వరలోనే బిగ్ అనౌన్స్మెంట్ రాబోతుందని థమన్ ట్వీట్ చేసారు.దీనితో పవన్ ఫ్యాన్స్ ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు