‘పండిట్ వ్యవస్థను రద్దు చేయండి’.. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ డిమాండ్

‘పండిట్ వ్యవస్థను రద్దు చేయండి’.. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ డిమాండ్

రాష్ట్ర ప్రభుత్వం భాషా పండితుల అప్ గ్రేడేషన్‌పై ఆర్డినెన్స్ తీసుకువచ్చి, పండిట్ వ్యవస్థను రద్దుచేసి అందరికీ స్కూల్ అసిస్టెంట్‌గా అప్ గ్రేడ్ చేయాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంఘం నాయకులు కలిసి వారి సమస్యలపై ఏకరువు పెట్టారు. 317 జీవో ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులను 2024 మార్చ్‌లో ఉద్యోగ విరమణ ద్వారా ఏర్పడే ఖాళీల్లో ప్రత్యేక జీవో విడుదల చేసి వారి సొంత జిల్లాకు కేటాయించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జగదీష్, నర్సింహులు కోరారు.

హెల్త్ కార్డు విషయంలో ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా కాస్ట్ లెస్ ట్రీట్మెంట్‌కు ఆదేశించి, అమలులోకి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏను విడుదల చేయాలని విజ్ఞప్తిచేశారు. కాగా సీఎం సానుకూలంగా స్పందించారని వారు చెప్పారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో టీపీసీసీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గాల్ రెడ్డి హర్షవర్దన్ రెడ్డి, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ సంఘం నాయకులు గిరిజారమణ, గోపాల్, లింగం, శ్రీరాములు, నర్సింగ్ రావు, అనిల్ రెడ్డి ఉన్నారు. సీఎంను కలిసిన అనంతరం వీరంతా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి అభినందనలు తెలిపారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు