గ్రూప్‌ ప్రిలిమినరీ పరీక్షకు లక్ష మంది డుమ్మా.. కటాఫ్‌ ఎంత ఉండొచ్చంటే?

గ్రూప్‌ ప్రిలిమినరీ పరీక్షకు లక్ష మంది డుమ్మా.. కటాఫ్‌ ఎంత ఉండొచ్చంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిన్న (జూన్ 9) ప్రశాంతంగా జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా పరీక్ష నిర్వహించారు. ఇక ఓఎంఆర్ పద్ధతిలో 895 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. అయితే.. లక్ష మందికి పైగా అభ్యర్థులు గ్రూప్ ప్రిలిమినరీ పరీక్షకు గైర్హాజరు అయ్యారని అధికారులు వెల్లడించారు. కాగా.. అభ్యర్థులు మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3.02 లక్షల మంది మాత్రమే హాజరయ్యారని టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. అంటే 74 శాతం మంది మాత్రమే పరీక్ష రాశారు. గ్రూప్ 1 కింద 536 పోస్టులు ఉండగా ఒక్కో పోస్టుకు 536 మంది పోటీ పడనున్నట్లు తెలిపారు. దీంతో.. పరీక్షకు సంబంధించిన ప్రిలిమ్స్ ఆన్సర్ కీని త్వరలో విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది.

కాగా.. అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా మల్టీ జోన్, రోస్టర్ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 28,150 మందిని మెయిన్ పరీక్షకు ఎంపిక చేయనున్నట్లు కమిషన్ వెల్లడించింది. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ నుంచి 25 ప్రశ్నలు వచ్చాయి. గణిత నేపథ్యం ఉన్నవారు వీటికి సమాధానాలను సులభంగా గుర్తించవచ్చు. సర్వేలు, నివేదికల నుంచి కూడా ప్రశ్నలు వచ్చాయి. ఈసారి సాధారణ కటాఫ్ 75-80 మార్కుల మధ్య ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆదివారం గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరగడంతో చాలా మంది అభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మదర్ థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన పరీక్షకు నలుగురు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు. అలాగే కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన సాయిప్రియ పరీక్షకు హాజరయ్యేందుకు వెళ్తుండగా కూనారం రైలు గేటు పడిపోవడంతో ఐదు నిమిషాలు ఆలస్యమైంది. అధికారులు అనుమతించకపోవడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. చేసేదేమీ లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. మరోవైపు మంథన్‌కు చెందిన ప్రసన్య పొరపాటున మరో స్నేహితురాలి హాల్‌టికెట్‌ తీసుకురాగా, అధికారులు ఆమెను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు