శ్రీశైలంలో పాత దుకాణాలను ఖాళీ చేయాలని అధికారుల ఆదేశం

శ్రీశైలంలో పాత దుకాణాలను ఖాళీ చేయాలని అధికారుల ఆదేశం

శ్రీశైలంలో పాత దుకాణాలను ఖాళీ చేయాలని ఆలయ అధికారులు ఆదేశించారు. నేటి ఉదయం 11 వరకు దేవస్థానం అధికారులు గడువు ఇచ్చారు. పాత దుకాణాల్లోని సరుకును 15 రోజులపాటు సిద్దరామప్ప షాపింగ్ కాంప్లెక్స్‌లో భద్రపరుచుకోవచ్చని సూచించారు అధికారులు అయితే పాత దుకాణాలను ఖాళీ చేయకుంటే జేసీబీతో కూల్చేస్తామని ఈఓ లవన్న హెచ్చరించారు. చాలాకాలం కిందటే పాత దుకాణాలను ఖాళీ చేయాలని చెప్పామని, పలుసార్లు హెచ్చరించినా యజమానులు వినడం లేదన్నారు. ఖాళీ చేయకుంటే పోలీసులు ప్రత్యేక బలగాల సహాయంతో కోర్టు ఉత్తర్వులను అమలు చేస్తామన్నారు ఈఓ లవన్న అయితే దుకాణాలను ఖాళీ చేయిస్తామని మైకుల ద్వారా అధికారులు హెచ్చరించారు. కాగా ఈఓ లవన్న హామీ ఇవ్వడంతో ఖాళీ చేసేందుకు పాత దుకాణ యజమానులు సిద్ధమవుతున్నారు.

Please follow and like us:
దేవాలయాలు భక్తి వార్తలు