ఎన్‌ఆర్‌ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం

ఎన్‌ఆర్‌ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో జహీరాబాద్‌ వాసి మృతి

అమెరికాలోని చోర్లెట్‌ ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ప్రాంతానికి చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్‌ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. పృపృథ్వీరాజ్‌ ఎనిమిదేళ్ల క్రితం ఐటీ ఉద్యోగం నిమిత్తం అమెరికా వెళ్లాడు. ఏడాదిన్నర కిందట సిద్దిపేట ప్రాంతానికి చెందిన శ్రీప్రియతో వివాహం జరిగింది.

భార్యాభర్తలు బయటకు వెళ్లి పని ముగించుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. రోడ్డుపై నిలిచి ఉన్న ఓ వాహనాన్ని పృథ్వీరాజ్‌ నడుపుతున్న కారు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో కారు బెలూన్లు తెరుచుకోవడంతో భార్యాభర్తలిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ప్రమాదం అనంతరం వారు రహదారికి మరోవైపు చేరుకున్నారు. కాగా, ప్రమాదం జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు పృథ్వీరాజ్‌ కారులో ఉండిపోయిన సెల్‌ఫోన్‌ కోసం వెళుతూ.. మళ్లీ రోడ్డు దాటుతున్న క్రమంలో అదే సమయంలో వేగంగా వచి్చన వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పృథ్వీ మృతదేహం శనివారం లేదా ఆదివారం ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని బంధువులు తెలిపారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు