‘హిట్ 3’ సినిమా హీరో అతనే.. చివర్లో రివీల్, బ్రూటల్ ఆఫీసర్ ‘అర్జున్ సర్కార్’గా!

‘హిట్ 3’ సినిమా హీరో అతనే.. చివర్లో రివీల్, బ్రూటల్ ఆఫీసర్ ‘అర్జున్ సర్కార్’గా!

ఇటీవల యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వచ్చిన విక్రమ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. విక్రమ్ సినిమాతో లోకేష్ కనకరాజు భారతీయ చిత్రసీమలో కూడా యూనివర్స్ ఫ్రాంఛైజీని పరిచయం చేశారు. ఇప్పుడు దాదాపుగా తెలుగు దర్శకులు అదే ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. అందుకు ఉదాహరణే ఇవాళ (డిసెంబర్ 2) విడుదలైన ‘హిట్ 2: ది సెకండ్ కేస్’. విశ్వక్ సేన్ హీరోగా నటించి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన ‘హిట్ 1: ది ఫస్ట్ కేస్’కు ఫ్రాంఛైజీగా (హిట్ యూనివర్స్) వచ్చిందే ఈ చిత్రం. ఈ హిట్ యూనివర్స్ ను మరింతగా పెంచుతామని డైరెక్టర్ శైలేష్ కొలను ఇదివరకే చెప్పారు. ఈ క్రమంలో ‘హిట్ 3’కి హీరో ఎవరనేది తెలిసిపోయింది.

సినిమాలపై ఆసక్తితో.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ గా నటించి అదరగొట్టిన చిత్రం హిట్ (HIT: The First Case). నాచురల్ స్టార్ నాని నిర్మాతగ వ్యవహరించిన ఈ చిత్రంతో శైలేష్ కొలను దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. నిజానికి శైలేష్ కొలను ఒక డాక్టర్. సినిమాలపై ఉన్న ఆసక్తితో డైరెక్టర్ అయ్యారు. చేసింది మొదటి సినిమా అయినా సూపర్ హిట్ కొట్టారు.

హిట్ 2లో అడవి శేష్.. 2020లో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ “హిట్: ది ఫస్ట్ కేస్” మంచి ప్రేక్షకాదరణ పొందింది. అంతేకాకుండా హిందీలో కూడా ఇదే పేరుతో విడుదలైంది. అక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే తెలుగులో ఈ సినిమా వచ్చినప్పుడు దీనికి సీక్వెల్ ఉంటుందని హింట్ కూడా ఇచ్చారు. అందుకనుగుణంగానే ఇప్పుడు “హిట్: ది సెకండ్ కేస్” ను తీసుకువచ్చారు. ఈ సెకండ్ కేస్ లో హీరోగా అడవి శేష్ నటించిన విషయం తెలిసిందే.

'హిట్ 3' సినిమా హీరో అతనే.. చివర్లో రివీల్, బ్రూటల్ ఆఫీసర్ 'అర్జున్ సర్కార్'గా!

హిట్ యూనివర్స్ గా.. ముందుగా హిట్ కి సీక్వెల్ గా తెరకెక్కిద్దామనుకున్న ఈ చిత్రాలను హిట్ యూనివర్స్ గా మార్చారు డైరెక్టర్ శైలేష్ కొలను. దీంతో హిట్ యూనివర్స్ క్రేజ్ పెరిగిపోతోంది. హిట్ 1 లాగే హిట్ 2 కూడా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో హిట్ 3లో హీరో ఎవరా అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరిగిపోయింది. అయితే హిట్ 2 ప్రమోషన్స్ లో హిట్ 3 హీరో గురించి చెప్పను కానీ, అందులో నేను ఉంటాను అని అడివి శేష్ చెప్పాడు.

మూడో కేసుకు హీరోగా నిర్మాత.. ఇదిలా ఉంటే హిట్ 3 సినిమా చూశాకా.. హిట్ 3లో ఎవరు హీరో అనేది రివీల్ చేసేశారు దర్శకనిర్మాతలు. అయితే హిట్ 3 కేస్ ను సాల్వ్ చేసేది ఎవరో కాదు.. మన నాచురల్ స్టార్ నాని. ఈ హిట్ ఫ్రాంఛైజీకి నాని నిర్మాత అని తెలిసిందే. ప్రశాంతి త్రిపిర్ నేనితో కలిసి ఈ సినిమాలను నిర్మిస్తున్నారు నాని. ఇక ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ కోసం నిర్మాత అయిన నాని హీరోగా పోలీస్ ఆఫీసర్ గా మారనున్నాడు.

బ్రూటల్ ఆఫిసర్ అర్జున్ సర్కార్ గా.. హిట్ 3లో నాని పాత్ర ఎలా ఉండనుందో కూడా హిట్ 2 క్లైమాక్స్ లో రివీల్ చేసింది మూవీ టీమ్. అర్జున్ సర్కార్ అనే బ్రూటల్ ఆఫీసర్ గా నాని కనిపించబోతున్నాడు. సాధారణంగా 100 మంది దోషులైన తప్పించుకోవచ్చు. కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదనేది మన చట్టం. కానీ అర్జున్ సర్కార్ విధానం మాత్రం అందుకు విరుద్ధంగా ఉండనుందట. దీంతో అంతటి బ్రూటల్ ఆఫీసర్ కు విలన్ ఇంకెంత బ్రూటల్ గా ఉంటాడో అని చర్చ నడుస్తోంది.

విలన్ గా విజయ్ సేతుపతి.. అయితే ప్రస్తుతం హిట్ 3లో విలన్ పాత్రలో కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కనిపించబోతున్నారని ఒక టాక్ అయితే వినిపిస్తోంది. దీనిలో ఎంత నిజముందనేది తెలియదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నాని పాన్ ఇండియా మూవీ దసరా షూటింగ్ లో బిజీగా ఉన్నారని తెలిసిందే. దీంతోపాటు మరో డెబ్యూ డైరెక్టర్ తో ఓ సినిమా ప్రారంభించనున్నారట.

హిట్ యూనివర్స్ లో 7 పార్ట్స్.. అయితే నాని.. డెబ్యూ డైరెక్టర్ తో ముందుగా సినిమా చేస్తారా.. లేదా హిట్ 3ని పట్టాలెక్కిస్తారో వేచి చూడాలి. ఇక హిట్ యూనివర్స్ లో ఏడు పార్ట్స్ ఉంటాయని చివరి పార్ట్ లో ఈ హీరోలందరూ కలిసి ఓ కేసుని సాల్వ్ చేస్తారని ఇదివరకు డైరెక్టర్ చెప్పిన విషయం తెలసిందే.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు