ఆ పథకాలకు నిధులు ఇటలీ నుంచి తెస్తారా..? కాంగ్రెస్‌పై రాజా సింగ్ సెటైర్

ఆ పథకాలకు నిధులు ఇటలీ నుంచి తెస్తారా..? కాంగ్రెస్‌పై రాజా సింగ్ సెటైర్

ఆరు గ్యారెంటీలకు నిధులు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి తెస్తారా లేక ఇటలీ నుంచి తెస్తారా సమాధానం చెప్పాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అసెంబ్లీ మీడియా సెంటర్‌లో గురువారం ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారని, ఇచ్చిన గ్యారెంటీలను కాంగ్రెస్ ఎలా అమలుచేస్తుందో చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఉండగా ప్రమాణం చేయబోమని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నట్లుగా చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీతో అధికారంలోకి వచ్చారని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీపై తమ యుద్ధం మొదలైందని రాజాసింగ్ చెప్పారు.

నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, హామీల అమలు జరిగే వరకు ప్రజల పక్షాన నిలబడతామని వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్‌ను స్టడీ సర్కిల్‌గా మారుస్తామని హామీ ఇచ్చి మరిచారని మండిపడ్డారు. రైతు బంధులో కోత విధించడం సరికాదని మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు.

Please follow and like us:
తెలంగాణ పాలిటిక్స్ వార్తలు