స్టింగ్‌ ఆపరేషన్‌.. పిల్లల విక్రయ ముఠా గుట్టురట్టు

స్టింగ్‌ ఆపరేషన్‌.. పిల్లల విక్రయ ముఠా గుట్టురట్టు

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో పిల్లల విక్రయాలు సంచలనం రేపుతోంది. పిల్లలను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 16 మంది చిన్నారులను మేడిపల్లి పోలీసులు కాపాడారు.

ఫిర్జాదిగూడలో ఆర్‌ఎంపీ శోభారాణితో సహా 11మంది ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిర్జాదిగూడ రామకృష్ణ నగర్‌లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అడ్డాగా 3 నెలల పసికందు నుంచి ఏడాది పిల్లల వరకు విక్రయాలు సాగుతున్నాయి. 16 మంది చిన్నారుల ట్రేస్ చేసి పోలీసులు కాపాడారు. మొత్తం 50 మందిని విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు. అక్షర జ్యోతి ఫౌండేషన్ స్టింగ్‌ ఆపరేషన్‌లో ఘటన వెలుగులోకి వచ్చింది. పోషించడం భారమంటూ తల్లులకు చెప్పి.. మానవత్వతో పిల్లలు లేనివారికి ఇస్తామంటూ నమ్మించి విక్రయాలు చేస్తున్నారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు