‘మనమే’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఫిక్స్

‘మనమే’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఫిక్స్

| టాలీవుడ్ యువ కథానాయ‌కుడు శర్వానంద్ (Sharwanand) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం మ‌న‌మే (Maname). ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం జూన్ 07న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

టాలీవుడ్ యువ కథానాయ‌కుడు శర్వానంద్ (Sharwanand) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం మ‌న‌మే (Maname). ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం జూన్ 07న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డ‌టంతో ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే టీజ‌ర్‌తో పాటు ట్రైల‌ర్‌లు విడుద‌ల చేయ‌గా.. మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కి రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మొద‌ట‌గా పిఠాపురంలో జరపనున్నారనే టాక్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఈ వార్త‌లు నిజం కాద‌ని చెబుతూ మేక‌ర్స్ కొత్త వేదిక‌ను అనౌన్స్ చేశారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ – పార్క్ హయత్ హోటల్లో నిర్వహించనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలు కానుంది. పాపులర్ బ్యానర్‌ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తుండ‌గా.. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు.

Please follow and like us:
సినిమా సినిమా వార్తలు