మహేష్ సినిమాకు చరణ్‌తో సంబంధం.. ఏమిటో తెలుసా?

మహేష్ సినిమాకు చరణ్‌తో సంబంధం.. ఏమిటో తెలుసా?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ SSMB28 అనే వర్కింగ్ టైటల్‌తో రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్‌ను ఇప్పటికే ప్రారంభించారు. అయితే మహేష్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొనడంతో, ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. ఇక త్వరలోనే మహేష్ తిరిగి ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

త్రివిక్రమ్ తనదైన మార్క్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా షూటింగ్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో లింక్ ఉందని తెలుస్తోంది. మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను హైదరాబాదల్‌లోని కాన్పూర్ అనే ఏరియాలో చిత్రీకరించనున్నారు. అయితే అక్కడ గతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ కోసం ఓ భారీ సెట్ వేశారు. ఇప్పుడు ఆ సెట్‌లో కొన్ని మార్పులు చేసి, మహేష్ బాబు సినిమా షూటింగ్‌ను నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.

దీంతో చరణ్‌కు డిజాస్టర్‌ను అందించిన ఈ సెట్‌లో మహేష్ బాబు సినిమా షూటింగ్ జరుపుకోవడం ఏమిటని, మహేష్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ సినిమా కథకు ఈ సెట్ చాలా ఉపయోగపడుతుందని భావించిన త్రివిక్రమ్, ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను ఇక్కడ చిత్రీకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.

Please follow and like us:
సినిమా సినిమా వార్తలు