డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై నాయకుల దూషణలు

డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై నాయకుల దూషణలు

మేడ్చల్ జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై ఓ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు దూషణలకు దిగారు. సీఎం నియోజకవర్గం మనోహరాబాద్ ఎంపీపీని అంటూ ట్రాఫిక్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారో వ్యక్తి… మద్యం తాగి వాహనం నడిపారు. పోలీసులను చూసి వాహనాన్ని పక్కకు తిప్పుకోవడంతో పోలీసులు అక్కడికి వెళ్లి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులపై ముగ్గురు రాజకీయ నాయకులు తిరగబడ్డారు. అంతేకాకుండా ఏం చేస్తావ్ అంటూ పోలీసులపై బెదిరింపులకు దిగారు. తాను మనోహరాబాద్ ఎంపీపీని అంటూ ఆ వ్యక్తి హల్‌చల్ చేశారు.

Please follow and like us:
తెలంగాణ పాలిటిక్స్ వార్తలు