శివరాజ్‌సింగ్‌ చౌహాన్ సీఎం కాలేదని మహిళల ఆవేదన..కన్నీరు పెట్టుకున్న మధ్యప్రదేశ్ మాజీ సీఎం

శివరాజ్‌సింగ్‌ చౌహాన్ సీఎం కాలేదని మహిళల ఆవేదన..కన్నీరు పెట్టుకున్న మధ్యప్రదేశ్ మాజీ సీఎం

శివరాజ్‌సింగ్‌ అభిమానులు, మద్దతుదారులు సీఎం కాకపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రధానంగా ఆయన అమలు చేసిన లాడ్లీ లక్ష్మీ యోజన పథకం మహిళా లబ్ధిదారులు శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు!

తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో(assembly elections) మధ్యప్రదేశ్ లో బీజేపీ ఘనవిజయం సాధించింది. మరోసారి పరిపాలనకు సారథ్యం వహించింది. మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chauhan) మళ్లీ సీఎం అవుతారని అందరూ ఊహించారు. కానీ ఆ అంచనాలు ఫలించకపోగా మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ (Mohan Yadav) ఎన్నికయ్యారు.రేపు ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది.ప్రస్తుతం సీఎంగా ఉన్న శివరాజ్ సింగ్ సీఎం కాలేరని తెలిసి ఆయన అభిమానులు, మద్దతుదారులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రధానంగా ఆయన అమలు చేసిన ‘లాడ్లీ లక్ష్మి పథకం’ (Ladli Lakshmi Scheme)లబ్ధిదారులైన మహిళలు శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.!

భావోద్వేగానికి లోనైన శివరాజ్ సింగ్ చౌహాన్

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు లాడ్లీ లక్ష్మీ యోజన మహిళా లబ్ధిదారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహిళలు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ స్వయంగా శివరాజ్ సింగ్ చౌహాన్ భావోద్వేగానికి గురయ్యారు. వారితో పాటు శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కన్నీరు కార్చారు.

https://x.com/ANI/status/1734478159649927417?s=20

Please follow and like us:
జాతీయం తెలంగాణ వార్తలు