కాంగ్రెస్‌ సర్కార్‌ రైతులను విస్మరించింది: కేటీఆర్‌

కాంగ్రెస్‌ సర్కార్‌ రైతులను విస్మరించింది: కేటీఆర్‌

తెలంగాణ ప్రభుత్వం రైతులను విస్మరించి రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌. రైతుల రోడ్ల మీదకు వచ్చిన ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందన్నారు.

కాగా, తెలంగాణభవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘రైతులు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం రాజకీయాలు చేసుకుంటుంది. ప్రభుత్వ పట్టింపు లేకపోవడంతో రైతుల వడ్లు కొనేవాళ్ళు లేరు. హమాలీల కొరత, ధాన్యం బస్తాల కొరత ఉంది. కామారెడ్డిలో అయిదు రోజులుగా రైతులు రోడ్లు ఎక్కారు. తరుగు పేరుతో క్వింటాల్ ధాన్యం తేసేస్తున్నారు. నిర్మల్, యాదాద్రిలో, భువనగిరి, సిరిసిల్లలో కూడా రైతులు రోడ్డు ఎక్కారు.

రైతుల ధాన్యాన్ని వెంటనే తీసుకోవాలి. తరుగు పేరుతో మోసం చేస్తున్నారు. రౌతులు ఆందోళన చెందవద్దు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. ధాన్యం కొనకుంటే రైతులపక్షాన రోడ్డెక్కుతాం. అన్నదాతలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేసీఆర్ రైతుల తరపునే ఉన్నారు. రైతులకు అవసరమైన చోట కేసీఆర్ ఎప్పటికీ అండగా ఉంటారు.

వరంగల్, ఖమ్మం, నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికీ గులాబీ జెండానే ఎగిరింది. ఇప్పుడు కుడా గులాబీ జెండానే గెలుస్తుంది. మా అభ్యర్థి రాకేష్ రెడ్డి విద్యావంతుడు. యువకులకు అండగా ఉంటాడు మా అభ్యర్థి. కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డీఎస్సీ అన్నారు. అది దగా డీఎస్సీగా మార్చారు. మా అభ్యర్థిని పట్టభద్రులు గెలిపిస్తే మీకు కావాల్సిన న్యాయంపైన చట్ట సభల్లో వారు ప్రశ్నిస్తారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాకే మెడికల్ కాలేజీలు, కొత్త జిల్లాల ఏర్పాటు చేశాం. గెలిచినా మొదటి ఏడాదే లక్ష ఉద్యోగాలు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికీ ఏమీ ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్దాలు. బ్లాక్ మైలర్లను ఎన్నుకుంటే నష్టపోతారు. అలాంటి వారిని ఎన్నుకుంటే మరో నయీమ్‌లను మళ్లీ చూస్తాము’ అంటూ కామెంట్స్‌ చేశారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు