మేము చేసిన ప్రతి అప్పుకు ఆడిట్‌ రికార్డు ఉంది

మేము చేసిన ప్రతి అప్పుకు ఆడిట్‌ రికార్డు ఉంది

చిట్‌చాట్‌లో మాజీ మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని ఆయన విమర్శించారు. రేవంత్‌ చెప్పిన ప్రతీ మాటకు రికార్డు ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే రుణమాఫీ చేస్తామని రాహుల్‌గాంధీ చెప్పారు. అధికారంలోకి రాగానే 4వేల రూపాయలు పెన్షన్‌ ఇస్తామని కేటీఆర్‌ అన్నారు. రుణమాఫీ చేసేందుకు ఎంత ఇబ్బందిపడ్డామో తమకు తెలుసాని అన్నారు. ఎవరైనా అధికారంలోకి రాకముందే ఆదాయ లెక్కలు చూస్తారు.. కానీ కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు లెక్కలు చూసుకుంటున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. తాము చేసిన ప్రతి అప్పుకు ఆడిట్‌ రికార్డు ఉందని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Please follow and like us:
తెలంగాణ పాలిటిక్స్ వార్తలు