క్లింకారా ఫస్ట్ బర్త్ డే.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్ వైరల్..

క్లింకారా ఫస్ట్ బర్త్ డే.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్ వైరల్..

క్లింకారా ఫస్ట్ బర్త్ డే

ఉపాసన పోస్ట్ వైరల్

నేడు రాంచరణ్ ,ఉపాసన కూతురు క్లింకారా మొదటి పుట్టిన రోజు.క్లింకారా పుట్టి అప్పుడే ఏడాది గడిచిపోయింది.క్లింకారా రాకతో మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషంగా వుంది.తన గారాల పట్టీని చూసుకుంటూ రాంచరణ్ ఎంతో మురిసిపోతున్నారు.రాంచరణ్ కు కూతురు పుట్టడంతో మెగా ఫ్యాన్స్ అంతా కూడా పండగ చేసుకున్నారు.క్లింకారా రాకతో మెగా ఫ్యామిలీకి ఎంతగానో కలిసి వచ్చింది రాంచరణ్ గ్లోబల్ పాపులారిటీ రావడం అలాగే మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం వంటివి జరిగాయి.క్లింకారా మెగా ఫ్యామిలీలోకి మహాలక్ష్మి లాగా వచ్చింది.అయితే క్లింకారా పుట్టినప్పటి నుండి తన ఫోటోలు ఎన్నో బయటకు వచ్చిన కూడా తన పేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.

ఇదిలా ఉంటే నేడు(జూన్ 20 ) క్లింకారా మొదటి పుట్టినరోజు సందర్భంగా ఉపాసన ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసింది ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.ఈ వీడియోలో ఉపాసన ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి క్లింకారా పుట్టెంత వరకు ఎలా ఫీల్ అయ్యారో వీడియో రూపం లో తెలియ జేసింది.పెళ్లి అయిన చాలా కాలానికి రాంచరణ్ ,ఉపాసన దంపతులకు క్లింకారా జన్మించడంతో మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషించింది.తన ముద్దుల కూతురు తనివితీరా ఎత్తుకొని రాంచరణ్ ఎంతో ఎమోషనల్ అయ్యారు.ఉపాసన షేర్ చేసిన వీడియోలో క్లింకారా బారసాల విజువల్స్ కూడా చూపించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Please follow and like us:
వార్తలు సినిమా