కన్నప్ప టీజర్ రిలీజ్ టైం ఫిక్స్..

కన్నప్ప టీజర్ రిలీజ్ టైం ఫిక్స్..

కన్నప్ప టీజర్ రిలీజ్ టైం ఫిక్స్
టీజర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రేక్షకులు

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “కన్నప్ప”.కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ,ఆవా ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాను ముకేశ్ కుమార్ సింగ్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి మంచు విష్ణు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ఆపోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.కన్నప్ప మూవీని పాన్ ఇండియా రేంజ్ లో భారీగా రిలీజ్ చేయనున్నారు.దీనితో పాన్ ఇండియా నటులను ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించేందుకు తీసుకున్నారు.

ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ,అక్షయ్ కుమార్ ,మోహన్ లాల్ ,శివరాజ్ కుమార్ ,మోహన్ బాబు వంటి పాన్ ఇండియా స్టార్స్ నటిస్తున్నారు.దీనితో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగిపోయాయి.ఇదిలా ఉంటే రీసెంట్ గా ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయినట్లు మేకర్స్ ప్రకటించగా ఆ న్యూస్ బాగా వైరల్ అయ్యింది.ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ ను జూన్ 14 రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే..తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ టైం ఫిక్స్ అయింది.నేడు 2.58 గంటలకు ఈ సినిమా టీజర్ రిలీజ్ కానున్నట్లు సమాచారం.ఈ టీజర్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు