కల్కి ట్రైలర్ అదిరింది..దీపికా పాత్ర డబ్బింగ్ పై ట్రోల్స్..

కల్కి ట్రైలర్ అదిరింది..దీపికా పాత్ర డబ్బింగ్ పై ట్రోల్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో అమితాబ్ ,కమల్ వంటి లెజెండరీ యాక్టర్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాలో దీపికా పదుకోన్ ,దిశా పాటని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేసారు.

దేశవ్యాప్తంగా పలు థియేటర్స్ ను ఎంపిక చేసి ఈ ట్రైలర్ ను భారీగా రిలీజ్ చేసారు.అయితే రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పినట్లుగా ఒక అద్భుత ప్రంపంచంలోకి వెళ్లినట్లుగా అనిపిస్తుంది.ఈ ట్రైలర్ లో విజువల్స్ అదిరిపోయినట్లు ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.హాలీవుడ్ స్థాయిలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించాడు.ప్రభాస్ స్టంట్స్ ,అమితాబ్ ,కమల్ లుక్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి.అయితే ఈ ట్రైలర్ లో దీపికా పాత్ర డబ్బింగ్ పై మాత్రం ట్రోల్స్ వస్తున్నాయి.సినిమా రిలీజ్ దగ్గర పడటంతో దీపికా తో హడావుడిగా డబ్బింగ్ చెప్పించారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.డబ్బింగ్ మార్చకపోతే సినిమా పరిస్థితి అంతే..అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు