రెబ‌ల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రభాస్ ‘కల్కి’ ట్రైల‌ర్ డేట్ ఫిక్స్

రెబ‌ల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రభాస్ ‘కల్కి’ ట్రైల‌ర్ డేట్ ఫిక్స్

పాన్ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స‌మ‌యం రానే వ‌చ్చింది. ప్రభాస్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘కల్కి 2898 AD’. వైజయంతి మూవీస్ బ్యాన‌ర్‌పై అశ్విన్ దత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. ఈ సినిమాకు మ‌హాన‌టి ఫేమ్ నాగ్‌ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

పాన్ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స‌మ‌యం రానే వ‌చ్చింది. ప్రభాస్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘కల్కి 2898 AD’. వైజయంతి మూవీస్ బ్యాన‌ర్‌పై అశ్విన్ దత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. ఈ సినిమాకు మ‌హాన‌టి ఫేమ్ నాగ్‌ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. దీపికా ప‌దుకొనే, దిశా ప‌టానీ క‌థానాయిక‌లుగా న‌టిస్తుండ‌గా.. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్‌ 27న ప్రేక్ష‌కుల ముందుకు సినిమా రానుంది. ఈ సినిమా విడుద‌ల‌కు ఇంకా 22 రోజులే ఉండ‌డంతో వ‌రుస ప్ర‌మోష‌న్స్ పాల్గోంటుంది క‌ల్కి టీమ్. అయితే ఈ సినిమా ట్రైల‌ర్ కోసం ప్ర‌భాస్ అభిమానులు ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ట్రైల‌ర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ఇచ్చారు మేక‌ర్స్. ఈ మూవీ ట్రైల‌ర్‌ను జూన్ 10న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీనితో పాటు గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం

Please follow and like us:
సినిమా సినిమా వార్తలు