నార్త్ అమెరికాలో వసూళ్ల సునామి సృష్టించిన “కల్కి”..

నార్త్ అమెరికాలో వసూళ్ల సునామి సృష్టించిన “కల్కి”..

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మైథలాజికల్‌ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ మొదటిరోజు రూ.191.5 కోట్లు భారీ వసూలు.

నార్త్ అమెరికాలో ఆల్ టైం భారీ వసూళ్లతో దూసుకుపోతుంది.

7 మిలియన్ డాలర్లకి పైగా వసూళ్లు.

వీకెండ్ కావడంతో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

తాజాగా బాక్సాఫీస్‌ వద్ద విడుదలైన ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మైథలాజికల్‌ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ మొదటిరోజు రూ.191.5 కోట్లు భారీ వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో రూ.100 కోట్ల రికార్డును సాధించిన 11వ చిత్రంగా కల్కి నిలిచింది. ఇక ఇందులో ప్రభాస్‌ నటించిన 5వ సినిమా కావడం విశేషం. మొదటి రోజు రూ.100 కోట్లు పైన వసూలు చేసిన చిత్రాల జాబితాలో రూ.223 కోట్ల గ్రాస్‌ తో వసూలు మొదటి స్థానంలో ‘RRR’ ఉండగా.. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ రూ.217 కోట్లు వసూలు చేసి రెండో స్థానంలో ఉంది. ఇక ఇప్పుడు మూడో స్థానంలో ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్లు వసూలు చేసి మూడో స్థానంలోకి వచ్చింది.

తొలి షో నుండే ప్రపంచవ్యాప్తంగా సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్ల వద్ద సినిమా చూడ్డానికి భారీగా వస్తున్నారు. ఇక ఈ చిత్రం నార్త్ అమెరికాలో ఆల్ టైం భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఇప్పటి వరకూ అక్కడ 7 మిలియన్ డాలర్లకి పైగా వసూళ్లు రాబట్టంది. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడిందించారు చిత్ర బృందం సభ్యులు. వీకెండ్ కావడంతో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ , దీపికా పదుకునే, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, శోభన, మాళవిక నాయర్ లాంటి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతాన్ని సంతోష్ నారాయణన్ అందించారు.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు