స్పెయిన్పై గెలుపుతో నాకౌట్ చేరిన జపాన్

స్పెయిన్పై గెలుపుతో నాకౌట్ చేరిన జపాన్

జపాన్ ఫుట్బాల్ టీమ్ చరిత్రను తిరగరాసింది. ఫిఫా వరల్డ్ కప్‌లో 20 ఏళ్ల తర్వాత నాకౌట్ చేరింది. గ్రూప్Eలో భాగంగా స్పెయిన్తో జరిగిన మ్యాచ్లో జపాన్ 2–1 గోల్స్ తేడాతో గెలిచి రౌండ్ 16కు అర్హత సాధించింది.

ఫస్టాఫ్లో గోల్ చేయని జపాన్..
మ్యాచ్ను దూకుడుగా మొదలు పెట్టిన స్పెయిన్..తొలి 10వ నిమిషాల్లోనే గోల్ కొట్టింది. ఆ టీమ్ ప్లేయర్ అల్వారో మొరాటా గోల్ చేసి స్పెయిన్ను 1–0 ఆధిక్యంలో నిలబెట్టాడు. ఆ తర్వాత జపాన్ గోల్ చేసేందుకు ప్రయత్నించినా..ఫలితం లేకుండా పోయింది. దీంతో ఫస్టాఫ్ను స్పెయిన్ 1–0తో ఆధిక్యంతో ముగించింది.

స్పెయిన్పై గెలుపుతో నాకౌట్ చేరిన జపాన్

సెకండాఫ్లో జపాన్ దూకుడు..
రెండో అర్థభాగంలో జపాన్ జోరుగా ఆడింది. మూడో నిమిషంలోనే జపాన్ ప్లేయర్ రిత్సు డోన్ అద్భుతమైన గోల్‌ చేసి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత మరో మూడు నిమిషాల్లోనే టనాక మరో గోల్ కొట్టి జపాన్‌ ఆధిక్యాన్ని 2–1కి పెంచాడు. ఆ తర్వాత స్పెయిన్ మరో గోల్ కొట్టేందుకు పలుమార్లు జపాన్ గోల్ పోస్టుపై దాడులు చేసింది. కానీ సాధ్యపడలేదు. చివరకు జపాన్ 2–1 గోల్స్ తేడాతో గెలిచింది.

స్పెయిన్పై గెలుపుతో నాకౌట్ చేరిన జపాన్

జపాన్ ముందుకు జర్మనీ ఇంటికి…
స్పెయిన్పై నెగ్గిన జపాన్.. గ్రూప్ E టాపర్‌గా నాకౌట్స్‌లో అడుగు పెట్టింది. స్పెయిన్పై జపాన్ గెలవడంతో…అనూహ్యంగా జర్మనీ నూహ్యంగా ఇంటి దారి పట్టింది. ఒక వేళ స్పెయిన్ గెలిస్తే మాత్రం జర్మనీ నాకౌట్కు వెళ్లేది. ఇక జపాన్ తమ తర్వాతి మ్యాచ్‌లో క్రొయేషియాతో తలపడనుంది. అటు ఈ మ్యాచ్లో ఓడినా కూడా స్పెయిన్ నాకౌట్కు చేరుకుంది.

Please follow and like us:
క్రీడలు వార్తలు