మొదటి వన్డేలో భారీ విజయాన్ని కైవసం చేసుకున్న టీమిండియా..

మొదటి వన్డేలో భారీ విజయాన్ని కైవసం చేసుకున్న టీమిండియా..

భారత్ దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌
తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం
సెంచరీ చేసిన స్మృతి మంధానకు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు.

భారత్, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన నేటి తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చూపుతూ సిరీస్‌ లోని మొదటి గేమ్‌ ను గెలుచుకుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా దక్షిణాఫ్రికా బౌలర్లను ఓ ఆట ఆదుకున్నారు. ముఖ్యంగా ఓపెనర్ స్మృతి మంధాన (117) విధ్వంసకర ఇన్నింగ్స్‌ తో అద్భుత సెంచరీని చేసింది. చివర్లో ఆల్ రౌండర్లు దీప్తి శర్మ (37), పూజా వస్త్రాకర్ (31 నాటౌట్) పరుగులు చేశారు. దింతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది.

ఇక బౌలింగ్ లోను టీమిండియా తన ప్రభావాన్ని బాగా చూపించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించడనియూకి వచ్చిన దక్షిణాఫ్రికాను భారత బౌలర్లు 122 పరుగులకే కుప్పకూల్చారు. సునే లూయిస్ (33), మరియన్ కాప్ (24), సినాలో హఫ్తా (27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో ఆశా శోభన 4 వికెట్లను తీసుకొని దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించింది. దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా.., రేణుకా సింగ్ ఠాకూర్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్ తలో వికెట్ తీశారు. దింతో టీమిండియా మొత్తంగా 143 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక సెంచరీ చేసిన స్మృతి మంధాన ( Smruthi mandana ) కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది

Please follow and like us:
క్రీడలు వార్తలు