తెలంగాణ ప్రజలకు బ్యాడ్ న్యూస్‌.. చార్జీలు పెంచిన ఆర్టీసీ..

తెలంగాణ ప్రజలకు బ్యాడ్ న్యూస్‌.. చార్జీలు పెంచిన ఆర్టీసీ..

తెలంగాణలో ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగాయి
టోల్ ప్లాజా రూట్లలో తిరిగే ఆర్టీసీ బస్సుల్లో రూ.3
మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం
పురుషులు మాత్రమే చార్జీలు భారం

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు చార్జీలు మరోసారి పెరిగాయి. హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్‌గేట్ల వద్ద ఈ ఫీజులు స్వల్పంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ టికెట్ చార్జీలు టోల్ గేట్ చార్జీలు పెరిగాయి. టోల్ ప్లాజాలు ఉన్న రూట్లలో తిరిగే ఆర్టీసీ బస్సుల్లో రూ.3 పెంచారు. టోల్ గేట్లతో రోడ్లపై తిరిగే ఆర్టీసీ బస్సులు కూడా టోల్ రుసుము చెల్లించాలి.

కేంద్రం నిర్ణయంతో టోల్ గేట్ చార్జీలు పెరగడంతో ఆర్టీసీ ప్రయాణికులపై భారం మోపింది. టికెట్ చార్జీల్లో చేర్చిన టోల్ ఫీజును రూ.3 పెంచింది. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రూ.10 నుంచి రూ.13, డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, వజ్ర బస్సుల్లో రూ.13 నుంచి రూ.16, గరుడ ప్లస్ బస్సుల్లో రూ.14 నుంచి రూ.17, గరుడ ప్లస్ బస్సుల్లో రూ.14 నుంచి రూ.17. నాన్-ఎసి స్లీపర్, హైబ్రిడ్ స్లీపర్ బస్సులలో 15 నుంచి రూ.18కి, ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ.20 నుంచి రూ.23కి.పెరిగిన చార్జీలు ఇటీవల అమల్లోకి వచ్చాయి.

ఒక్కో టోల్ గేట్‌కు రూ. 3 పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.దేశవ్యాప్తంగా టోల్ చార్జీలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిత్యం 30 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని.. ఇందులో నగరంలో 12 లక్షల మంది, పల్లె వెలుగు బస్సుల్లో 12 లక్షల మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు. ఛార్జీల పెంపు భారం తమకు వర్తించదని, మిగిలిన 6 లక్షల మందికి మాత్రమే అదనపు భారం పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. చార్జీలు పెంచినా టోల్ గేట్ల వద్ద టోల్ చెల్లించడంతో ఆర్టీసీకి అదనపు ఆదాయం వస్తుందని తెలుస్తోంది.

టోల్ చార్జీల పెంపు నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ అధికారులు కూడా బస్సు చార్జీలను పెంచడంతో పాటు వేళల్లో మార్పులు చేశారు. అయితే చార్జీల పెంపుపై ఆర్టీసీ ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం. ఛార్జీల పెంపుపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. వారిపై ఎలాంటి భారం పడే అవకాశం లేదు. ఇప్పుడు ఆ భారాన్ని పురుషులు మాత్రమే భరించాల్సి ఉంటుంది.

Please follow and like us:
తెలంగాణ వార్తలు