మరో మూడు రోజులు జాగ్రత్త..తెలంగాణ ప్రజలకు వాతావరణకేంద్రం వార్నింగ్..

మరో మూడు రోజులు జాగ్రత్త..తెలంగాణ ప్రజలకు వాతావరణకేంద్రం వార్నింగ్..

రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు చలితీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.మూడు రోజుల తర్వాత చలి తీవ్రత సాధారణ స్థితికి రావొచ్చుని పేర్కొంది.

తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. శీతాకాలంలో సాధారణ స్థాయి నుంచి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నమోకార్తీకమాసంలో కొద్దిగా ఉండే చలి ఇప్పుడు మరింత పెరిగింది..

రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు చలితీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.మూడు రోజుల తర్వాత చలి తీవ్రత సాధారణ స్థితికి రావొచ్చుని పేర్కొంది.

ఇక డిసెంబర్ చివరి వారం నుంచి చలి తీవ్రత మళ్లీ పెరుగుతుందని, చల్లని గాలులు వీస్తాయని హెచ్చరించింది.రాత్రి సమయంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే ఒక డిగ్రీ వరకు తక్కువగా నమోదవుతున్నట్లు తెలిపింది.

తెలంగాణ రాజధాని హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో 12 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. పెరుగుతున్న చలిని తట్టుకునేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచిస్తోంది.

మెదక్ జిల్లాలో అత్యల్పంగా 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత, అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 18 డిగ్రీలు నమోదవుతున్నట్లు పేర్కొంది.

పగటి పూట సగటున 28 నుంచి 31 డిగ్రీల మధ్య ఉంటున్నట్లు పేర్కొంది. ప్రతీ ఏడాది చలి తీవ్రత ఎక్కువగా ఉండే ఆదిలాబాద్, ములుగు,ఆసిఫాబాద్ జిల్లాల్లో ప్రస్తుతం సాధారణ స్థాయిలోనే ఉంటోందని తెలిపింది.

అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 31 డిగ్రీలు, అత్యల్పంగా హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో 28 డిగ్రీలు నమోదవుతోంది. చలితీవ్రత గతేడాది కంటే ఈసారి ఎక్కువగానే ఉందని నగరవాసులు అంటున్నారు.

చలితీవ్రత పెరుగుతుందని వాతావరణ కేంద్రం ప్రకటనతో తెల్లవారుజామునే వ్యాపారాలు చేసుకునే వారు, వృద్దులు, పనులపై బయటకు వచ్చే వాళ్లు చలి తగలకుండా ష్వట్టర్లు,మందంగా ఉండే జర్కిన్స్ ఉపయోగిస్తున్నారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు