గేమ్ ఛేంజర్ లో రాంచరణ్ పాత్ర ఎలా ఉంటుందంటే..?

గేమ్ ఛేంజర్ లో రాంచరణ్ పాత్ర ఎలా ఉంటుందంటే..?

గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “గేమ్ ఛేంజర్”..ఈ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి మరో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాలో రాంచరణ్ తండ్రి ,కొడుకుగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో కొడుకు పాత్ర పేరు “రామ్ నందన్” అని తండ్రి పాత్ర పేరు “అప్పన్న” అని తెలుస్తుంది.అప్పన్న పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో రానున్నట్లు సమాచారం.అప్పన్న పాత్రలో రాంచరణ్ లుక్ ఎంతో కొత్తగా ఉంటుంది.అప్పన్న లుక్ లో రాంచరణ్ ఫొటోస్ ఇంతకుముందే లీక్ అయ్యాయి.పంచకట్టులో పవర్ ఫుల్ నాయకుడిగా రాంచరణ్ కనిపించారు.అయితే ఈ సినిమాలో అప్పన్న పాత్రకి నత్తి కూడా ఉంటుందని సమాచారం.ఈ నత్తి సమస్యే సినిమాలో ఎంతో కీలకంగా వుండనుందని సమాచారం.అలాగే తండ్రి ఆశయాన్ని నెరవేర్చే రామ్ నందన్ పాత్రలో రాంచరణ్ అద్భుతంగా నటించినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో జరుగుతుంది.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు