హాయ్ నాన్న కంటే ముందే… అదే స్టోరీతో వచ్చిన ఈ సినిమా ఏంటో తెలుసా..? చూశారా..?

హాయ్ నాన్న కంటే ముందే… అదే స్టోరీతో వచ్చిన ఈ సినిమా ఏంటో తెలుసా..? చూశారా..?

నాచురల్ స్టార్ నాని ఈ సంవత్సరం మరొక హిట్ కొట్టారు. హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులని పలకరించారు నాని. తండ్రి సెంటిమెంట్ నానికి బాగా కలిసి వచ్చింది ఏమో అని చెప్పవచ్చు. నాలుగు సంవత్సరాల క్రితం జెర్సీ సినిమాతో తండ్రి సెంటిమెంట్ సినిమాలో నటించారు.

ఆ సినిమా తెలుగు సినిమాల్లోనే గొప్ప సినిమాల్లో ఒకటిగా ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇప్పుడు ఈ సినిమాతో మరొక సారి తండ్రిగా నటించారు నాని. తన కూతురిని పెంచుకుంటూ, ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే సింగిల్ పేరెంట్ గా హాయ్ నాన్న సినిమాలో నాని నటించారు.

సినిమా కథ, కాన్సెప్ట్ పెద్ద కొత్తది ఏమీ కాదు. ఇలాంటి కథ ఉన్న సినిమాలు అంతకుముందు చూసాం. అయితే హాయ్ నాన్న సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాని మరొక సినిమాతో పోలుస్తున్నారు. ఆ సినిమా కూడా ఈ సంవత్సరం విడుదల అయ్యింది. ఆ సినిమానే తమిళ సినిమా డాడా (దాదా). హీరోకి కూడా ఈ సినిమాలో ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకు హీరోని డాడా అని పిలుస్తూ ఉంటాడు.

అయితే, ఈ సినిమాలో కూడా హీరో, హీరోయిన్ అనుకోకుండా తల్లిదండ్రులు అవ్వడం, కొన్ని కారణాల వల్ల హీరోయిన్ హీరోని వదిలిపెట్టి వెళ్లిపోవడం, తన కొడుకు బాగోగులని హీరోనే చూసుకుంటూ రావడం, కొన్ని సంవత్సరాల తర్వాత హీరోయిన్ మళ్ళీ వీళ్లిద్దరి జీవితాల్లోకి రావడం, తర్వాత వాళ్ళందరూ ఒకటి అవ్వడం ఇలా ఈ సినిమా కథ నడుస్తుంది. దాదాపు హాయ్ నాన్న సినిమా స్టోరీ లైన్ కూడా ఇలాగే ఉంటుంది. కాకపోతే ఈ సినిమాలో హీరోయిన్ కి గతం మర్చిపోవడం లాంటివి ఏమీ ఉండవు. అంతే కాకుండా వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోరు. ఈ సినిమా తమిళ్ లో రిలీజ్ అయ్యింది.

ఇప్పుడు ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకి పాపా పేరుతో తీసుకువస్తున్నట్లు సమాచారం. అయితే హాయ్ నాన్న చూసిన మరి కొంత మంది రాజశేఖర్, సౌందర్య హీరో, హీరోయిన్లుగా నటించిన మా ఆయన బంగారం సినిమాతో కూడా పోలుస్తున్నారు. అందుకు ముఖ్య కారణం ఈ సినిమాలో కూడా హీరోయిన్ గతం మర్చిపోవడం. కానీ ఈ సంవత్సరం డాడా సినిమా రావడంతో ఈ సినిమాతో మరీ ఎక్కువగా పోలికలు వస్తున్నాయి. హాయ్ నాన్న తమిళ్ లో కూడా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా చూసిన వాళ్లు బహుశా వాళ్ళ సినిమాతో పోల్చుకొని కూడా ఉంటారు ఏమో.

Please follow and like us:
సినిమా సినిమా వార్తలు