తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా..

తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా..

తెలంగాణలో పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 28 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ సీఎం రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం 20 మంది IASలను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా 28 మంది IPS అధికారులను ట్రాన్స్‌ఫర్‌ చేసింది. ఎన్నికలు పూర్తికావడంతో త్వరలోనే మరికొంతమంది అధికారులను బదిలీ చేసే అవకాశం ఉంది. మొత్తం బదిలీ అయిన వారిలో కొందరిని డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి రానున్నట్లు తెలిపింది.

తెలంగాణలో పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 28 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ సీఎం రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం 20 మంది IASలను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా 28 మంది IPS అధికారులను ట్రాన్స్‌ఫర్‌ చేసింది. ఎన్నికలు పూర్తికావడంతో త్వరలోనే మరికొంతమంది అధికారులను బదిలీ చేసే అవకాశం ఉంది. మొత్తం బదిలీ అయిన వారిలో కొందరిని డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి రానున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. బదిలీ అయిన జాబితాలో చాలా మంది సీనియర్ నేతలతోపాటు కొత్తగా బాధ్యతలు తీసుకున్న వారు కూడా ఉన్నారు. కేవలం ఒక డిపార్ట్ మెంట్ కు మాత్రమే పరిమితం చేయకుండా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, సైబర్ సెక్యూరిటీస్, యాంటీ నార్కోటిక్‌ బ్యూరో ఇలా అనేక శాఖల్లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో బదిలీ అయిన ఐపీఎస్‎లు..

జగిత్యాల ఎస్పీగా అశోక్‌కుమార్‌
సూర్యాపేట ఎస్పీగా సన్‌ప్రీత్‌సింగ్‌
హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా రాహుల్‌ హెగ్డే
జోగులాంబ గద్వాల ఎస్పీగా టి. శ్రీనివాసరావు
మహబూబ్‌నగర్‌ ఎస్పీగా జానకి ధరావత్‌
ఆసిఫాబాద్‌ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు
బాలానగర్‌ డీసీపీగా కె.సురేశ్‌ కుమార్‌
సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా హర్షవర్దన్‌
సీఐడీ ఎస్పీగా విశ్వజిత్‌
శంషాబాద్ డీసీపీగా బి. రాజేష్‌
వికారాబాద్‌ ఎస్పీగా కె.నారాయణరెడ్డి
ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌గా రుత్‌రాజ్‌
నల్గొండ ఎస్పీగా శరత్‌ చంద్రపవార్‌
మేడ్చల్‌ జోన్‌ డీసీపీగా ఎన్‌.కోటిరెడ్డి
ఆదిలాబాద్‌ పీటీసీ ఎస్పీగా నితికా పంత్‌
సికింద్రాబాద్‌ రైల్వే ఎస్పీగా చందనా దీప్తి
వరంగల్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా షేక్ సలీమా
హైదరాబాద్‌ నార్త్‌ జోన్‌ డీసీపీగా సాధన రష్మి పెరుమాళ్‌
హైదరాబాద్ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో ఎస్పీగా సాయి చైతన్య
జనగామ వెస్ట్‌ జోన్‌ డీసీపీగా బి.మహేంద్ర నాయక్‌
మంచిర్యాల డీసీపీగా ఎ. భాస్కర్‌
డిచ్‌పల్లి ఏడో బెటాలియన్‌ కమాండెంట్‌గా రోహిణి ప్రియదర్శిని

Please follow and like us:
తెలంగాణ వార్తలు