అయ్యప్పస్వామి భక్తులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న కేరళ సర్కార్..

అయ్యప్పస్వామి భక్తులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న కేరళ సర్కార్..

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇది నిజంగా శుభవార్త. భక్తుల రద్దీ దృష్ట్యా కేరళ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది.

భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది. శబరిమలలో దర్శన సమయం మరో గంట పాటు పొడిగించింది. అభిషేకం, విశేష పూజల నిడివి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే అయ్యప్ప దర్శనానికి వస్తున్న వృద్ధులు, కన్నెస్వాములకు ఆహార సదుపాయాలు అందజేస్తున్నారు. ఇక ఆన్‌లైన్ ద్వారా రోజువారీ దర్శన టికెట్లను 90 వేలకు పరిమితం చేసింది ట్రావెన్‌కోర్ బోర్డ్. తద్వారా భక్తుల రద్దీని తగ్గించవచ్చునని భావించింది.

భక్తులు, మాలధారులతో అయ్యప్ప స్వామి కిక్కిరిసి పోతోంది. రోజూ లక్ష మంది వరకు స్వామి వారి దర్శనానికి వస్తున్నారు. సోమవారం ఒక్కరోజే 1,70,260 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అందరినీ ఒకే సారి వదలకుండా.. పంబ నుంచి సన్నిధానం వరకు విడతల వారీగా భక్తులను అనుమతిస్తున్నారు. భక్తుల దర్శనార్థం అయ్యప్ప స్వామి దేవాలయాన్ని నవంబర్ 16వ తేదీన ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. నాటి నుంచి భక్తులు భారీ ఎత్తున శబరిమలకు తరలి వస్తున్నారు. భక్తుల తాకిడీ ఎక్కువ అవడంతో.. స్వామి దర్శనం మరింత ఆలస్యం అవుతోంది. దాంతో బక్తులు గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

Please follow and like us:
దేవాలయాలు భక్తి వార్తలు