గోల్డ్ లవర్స్‌కి ఇది షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతకు చేరాయంటే

గోల్డ్ లవర్స్‌కి ఇది షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతకు చేరాయంటే

బంగారం ధరలు కాస్త శాంతిస్తున్నాయని అనుకుంటున్న తరుణంలో మళ్లీ పెరుగుతున్నాయి. తులం బంగారం ధర మళ్లీ రూ. 75 వేల మార్క్‌కు చేరువయ్యేందుకు సన్నద్దమైంది. ఇదిలా ఉంటే.. గురువారం మరోసారి బంగారం ధరల్లో మార్పులు కనిపించాయి. బుధవారంతో పోలిస్తే..

బంగారం ధరలు కాస్త శాంతిస్తున్నాయని అనుకుంటున్న తరుణంలో మళ్లీ పెరుగుతున్నాయి. తులం బంగారం ధర మళ్లీ రూ. 75 వేల మార్క్‌కు చేరువయ్యేందుకు సన్నద్దమైంది. ఇదిలా ఉంటే.. గురువారం మరోసారి బంగారం ధరల్లో మార్పులు కనిపించాయి. బుధవారంతో పోలిస్తే.. మళ్లీ స్వల్పంగా పెరిగాయి. మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

  • దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,310గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 72,320 వద్ద కొనసాగుతోంది.
  • దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,160కాగా,24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,170గా ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,810కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 72,880గా ఉంది.
  • కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,160కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,170 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

  • హైదరాబాద్‌లో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,160కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,170గా ఉంది.
  • విజయవాడలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,160కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,170గా ఉంది.
  • విశాఖపట్నం విషయానికొస్తే ఇక్కడ కూడా ఈ రోజు హైదరాబాద్‌, విజయవాడలో నమోదైన ధరలు మాదిరిగానే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,160కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,170గా ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
వెండి కూడా బంగారం బాటలో పయణిస్తోంది. వాటి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి రూ. 100వరకు పెరిగింది. ఢిల్లీతో పాటు, ముంబయి, కోల్‌కతా, పుణెలో కిలో వెండి ధర రూ. 91,400గా ఉండగా హైదరాబాద్‌, చెన్నై, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ. 95,900కి చేరుకుంది. కాగా, ఈ బంగారం ధరలు ఈరోజు ఉదయం ఆరు గంటలకు నమోదైనవిగా గమనించగలరు. బంగారం కోనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు చెక్‌ చేసుకోవడం బెటర్‌. ఇక లేటెస్ట్‌ బంగారం ధరలను తెలుసుకోవడానికి, మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

Please follow and like us:
బిజినెస్ వార్తలు