స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్ లో తులం ధర ఎంతంటే..

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్ లో తులం ధర ఎంతంటే..

దేశంలో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,270కు చేరింది. ఇక 10గ్రాముల 22 క్యారెట్ల పసిడి విషయానికి వస్తే రూ. 66,240వద్ద కొనసాగుతోంది. అలాగే వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు కనిపించాయి. నిన్న కేజీ వెండి రూ. 94,500కాగా ఈరోజు కిలోపై రూ. 100 తగ్గి రూ. 94,400కు చేరింది. ఇక దేశీయ మార్కెట్లో వివిధ రాష్ట్రాల్లో బంగారం ధరల రేట్లు ఇలా ఉన్నాయి. జూలై మాసం ప్రారంభంలోనే తగ్గుముఖం పట్టడం పసిడి కొనుగోలు ప్రియులకు కాస్త ఆశలు చిగురించేలా చేసింది. అలాగే పెట్టుబడి పెట్టే వారికి కూడా స్వల్ప ఊరట లభించినట్లైందని చెప్పవచ్చు. ఇలా తగ్గుదల ఎప్పటి వరకు కొనసాగుతుందో చూడాలి.

24 క్యారెట్ల బంగారం ధరలు..
హైదరాబాద్ – రూ. 72,270
విజయవాడ – రూ. 72,270
బెంగళూరు – రూ. 72,270
ముంబై – రూ. 72,270
కోల్‎కత్తా – రూ.72,410
ఢిల్లీ – రూ.72,410
చెన్నై – రూ.72,920
22 క్యారెట్ల బంగారం ధరలు..
హైదరాబాద్ – రూ. 66,240
విజయవాడ – రూ. 66,240
బెంగళూరు – రూ. 66,240
ముంబై – రూ. 66,240
కోల్‎కత్తా – రూ. 66,390
ఢిల్లీ – రూ. 66,390
చెన్నై – రూ. 66,840
కిలో వెండి ధరలు ఇలా..
హైదరాబాద్ – రూ. 94,400
విజయవాడ – రూ. 94,400
ముంబై – రూ. 94,400
చెన్నై – రూ. 94,400
బెంగళూరు – రూ. 90,150
కోల్‎కత్తా – రూ. 89,900
ఢిల్లీ – రూ. 89,900

Please follow and like us:
బిజినెస్ వార్తలు