అంతకంతకూ పెరుగుతున్న గడ్డం వంశీ కృష్ణ మెజారిటీ… 1 లక్షా 25 వేలతో ముందంజ

అంతకంతకూ పెరుగుతున్న గడ్డం వంశీ కృష్ణ మెజారిటీ… 1 లక్షా 25 వేలతో ముందంజ

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. రౌండ్ రౌండ్ కు తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, బీఆర్ ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ లకంటే ముందంజలో ఉన్నారు. లక్షా 25 వేల ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. గడ్డం వంశీకృష్ణ అత్యధిక మెజార్టీతో గెలుస్తారని కాంగ్రెస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఈ సందర్భంగా గడ్డం వంశీ కృష్ణ మాట్లాడుతూ పెద్దపల్లి ప్రజలు తనను నమ్మి ఆశీర్వదించారని చెప్పారు. గత పది సంత్సరాలుగా పెద్దపల్లిలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. పెద్దపల్లి అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. తన గెలుపునకు అండగా ఉన్న మంత్రి శ్రీధర్ బాబు స్థానిక ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. 8 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. మహబూబాబాద్, జహీరాబాద్, భువన గిరి, ఖమ్మం, వరంగల్, నాగర్ కర్నూల్, నల్లగొండ పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ లో ఉంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ ఒక్క సెగ్మెంట్ లో కూడా ప్రభావం చూపిం చూపలేకపోయింది.

.

Please follow and like us:
తెలంగాణ వార్తలు