వరుసగా రెండో రోజు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షలు..

వరుసగా రెండో రోజు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షలు..

వరుసగా రెండో రోజూ సమీక్షలకు సిద్ధం అయిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

నేడు సోషల్ ఆడిట్.. ఇంజినీరింగ్.. గ్రామీణ నీటి సరఫరా విభాగాల అధికారులతో సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రితో పాటు తనకు కేటాయించిన మంత్రిత్వశాఖల బాధ్యతలను బుధవారం రోజు చేపట్టిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. తొలిరోజే బిజీబిజీగా గడిపారు.. వరుసగా శాఖాపరమైన సమీక్షలు నిర్వహించారు. నిన్న ఉదయం గ్రామీణాభివృద్ధి శాఖల HODలతో సమీక్ష సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం.. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. శాఖల్లో అంశాల వారీగా అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఇక, ఆయా శాఖల్లో ప్రస్తుత పరిస్థితులపై అధికారుల నుంచి పలు వివరాలను అడిగి తెలుసుకుని డిప్యూటీ సీఎం.. అన్నీ నోట్ చేసుకున్నారు. అలాగే, ఆయా శాఖల్లో కార్యాచరణపై మరోమారు త్వరలోనే సమీక్ష సమావేశాలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకుందామని అధికారులతో చెప్పారు.

ఇక, వరుసగా రెండో రోజూ సమీక్షలకు సిద్ధం అయ్యారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఈ రోజు తన శాఖలకు సంబంధించిన సోషల్ ఆడిట్, ఇంజినీరింగ్, గ్రామీణ నీటి సరఫరా విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు పవన్‌ కల్యాణ్‌.. మరోవైపు.. నిన్న బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరు చేస్తూ మొదటి ఫైల్‌పై, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించిన రెండో ఫైల్ పై సంతకం చేసిన విషం విదితమే.. అంతేకాదు.. ఉపాధి హామీ కూలీల వేతనాల చెల్లింపుల్లో ఆలస్యానికి కారణం ఎవరు? పంచాయతీలకు సమాంతరంగా సచివాలయాలను ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? స్థానిక సర్పంచ్‌లకు వాటిపై నియంత్రణ లేకపోతే ఎలా? ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీలకు ఎందుకు ఇవ్వట్లేదు? అని సమీక్ష సమావేశంలో ప్రశ్నించారట డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు