నాకు చరణ్ కు పవన్ వల్ల గొడవలు.. సీక్రెట్ బయటపెట్టిన చిరు కూతురు..

నాకు చరణ్ కు పవన్ వల్ల గొడవలు.. సీక్రెట్ బయటపెట్టిన చిరు కూతురు..

మెగా డాటర్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఈమె ఆన్ స్క్రీన్ కనిపించలేదు కానీ ఆఫ్ స్క్రీన్ ద్వారా బాగా పాపులారిటిని సంపాదించుకుంది.. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి ఇప్పటికే పలు వెబ్ సిరీస్లు, వెబ్ మూవీస్ నిర్మించారు. ఇక ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి తర్వాత వస్తున్న సిరీసే ‘పరువు’. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ వెబ్ సిరీస్ సక్సెస్ టాక్ అందుకున్న సందర్బంలో ఓ ఛానెల్ కు టీమ్ ఇంటర్వ్యూ ఇచ్చారు..

ఆ సందర్బంగా సుష్మిత తన బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు.. నాకు చరణ్ కు గొడవలు వచ్చేది బాబాయ్ వల్ల.. ఆయన ఇద్దరికీ గొడవ పెట్టి సినిమాను చూసినట్లు చూస్తాడు.. ఆయన మాతో ఎప్పుడూ సరదాగా ఉండేవాడని చెప్పింది. ఇప్పుడు రాజకీయాల్లో సక్సెస్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది.. ప్రజల మనిషి ఆయన వారికోసం ఏదైన చేస్తాడని చెప్పింది.. అలాగే క్లింకార ను ఎందుకు చూపించలేదని యాంకర్ అడగ్గా.. తమ పాపను ఇప్పుడే అందరికీ చూపించకూడదని రామ్ చరణ్, ఉపాసన అనుకున్నారు.. వాళ్ల ఇష్టమని సుష్మిత సమాధానం చెప్పింది.. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..

ఈ వెబ్ విషయానికొస్తే.. ‘పరువు’లో లీడ్ రోల్లో యాక్ట్ చేశారు. సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకులు. ఈ మూవీలో నాగబాబు, నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి వంటి వారు లీడ్ రోల్లో యాక్ట్ చేశారు.. ఈ సిరీస్ మొత్తం పరువు కోసం అనే లైన్ మీద నడుస్తుంది.. ప్రస్తుతం సక్సెస్ టాక్ తో దూసుకుపోతుంది. త్వరలోనే పరువు 2 రాబోతుందని సమాచారం..

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు