అవతార్ 2.. ఆ రాష్ట్రంలో నిషేధం..

అవతార్ 2.. ఆ రాష్ట్రంలో నిషేధం..

అవతార్ 2 సినిమాని కేరళలో నిషేధిస్తూ ఫిల్మ్ ఎగ్జిబ్యూటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ నిర్ణయం తీసుకుంది. ఈ సంచలన నిర్ణయానికి అక్కడి సినీ పరిశ్రమ, డిస్ట్రిబ్యూటర్స్ షాక్ అయ్యారు

జేమ్స్ కామెరూన్ తెరకెక్కిన అవతార్ సినిమాకి 13 ఏళ్ళ తర్వాత సీక్వెల్ గా ‘అవతార్ : ది వే ఆఫ్ వాటర్’ సినిమా రాబోతుంది. అవతార్ పార్ట్ 2 డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా టికెట్స్ మొత్తం అమ్ముడుపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి ఫుల్ క్రేజ్ ఉంది.

అవతార్ 2 క్రేజ్ ని క్యాష్ చేసుకోడానికి డిస్ట్రిబ్యూటర్స్ హక్కుల కోసం ఎగబడుతున్నారు. టికెట్ రేట్లు కూడా పెంచేశారు. అయితే ఈ సినిమాపై కేరళలో నిషేధం విధించారు. అవతార్ 2 సినిమాని కేరళలో నిషేధిస్తూ ఫిల్మ్ ఎగ్జిబ్యూటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ నిర్ణయం తీసుకుంది. ఈ సంచలన నిర్ణయానికి అక్కడి సినీ పరిశ్రమ, డిస్ట్రిబ్యూటర్స్ షాక్ అయ్యారు.

అయితే దీనికి కారణం ఏంటంటే.. సాధారణంగా థియేట్రికల్ బిజినెస్ ద్వారా వచ్చే ఆదాయంలో ఎగ్జిబిటర్స్ 50 శాతం షేర్ ని డిస్ట్రిబ్యూటర్స్ కి ఇస్తుంటారు. అవతార్ సినిమాకి హైప్ ఎక్కువగా ఉండటంతో డిస్ట్రిబ్యూటర్స్ 60 శాతం వరకు షేర్ కావాలని పట్టు పట్టారు. చివరికి ఎగ్జిబిటర్స్ 55 శాతం ఇస్తామన్నా ఒప్పుకోలేదు. దీంతో ఫిల్మ్ ఎగ్జిబ్యూటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ అవతార్ 2 సినిమాని కేరళలో రిలీజ్ చేయము అంటూ నిషేధించింది.

ఫిల్మ్ ఎగ్జిబ్యూటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ పరిధిలో దాదాపు 400 థియేటర్స్ ఉన్నాయి. సినిమా రిలీజ్ పై మరోసారి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈ సినిమా కేరళలో రిలీజ్ అవ్వదా అని అభిమానులు బాధపడుతున్నారు. మరి సినిమా రిలీజ్ టైం వరకు చర్చలు సఫలం అవుతాయేమో చూడాలి.

Please follow and like us:
సినిమా సినిమా వార్తలు