రేపే చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. తుది దశకు ఏర్పాట్లు..!

రేపే చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. తుది దశకు ఏర్పాట్లు..!

టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. గన్నవరంలోని కేసరపల్లి ఐటీ పార్కు దగ్గర 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రధాని మోడీ సహా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. రేపు ఉదయం 10. 45 నుంచి 12. 45 గంటల వరకు విజయవాడలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉందనున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో భారీగా భద్రతను ఏర్పాటు చేశారు.

ఇక, ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లపై ఇప్పటికే ఏపీ సీఎం నీరభ్ కుమార్ సమీక్ష జరిపారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సీఎస్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో నిన్నే చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. వీఐపీల కోసం నాలుగు గ్యాలరీలు, ప్రజల కోసం ఒక గ్యాలరీ మొత్తం 5 గ్యాలరీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న కేసరపల్లిలో కార్యక్రమం కావటంతో హైవేపై ఆంక్షలు విధించారు. ఇవాళ్టి సాయంత్రం నుంచే ట్రాఫిక్ మళ్లింపులు అమల్లోకి రానున్నాయి.

కాగా, తెలుగుదేశం- జనసేన- జేపీ పార్టీల నుంచి దాదాపు 2 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో భారీ ఎత్తున ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేస్తున్నారు. వర్షం కురిసిన కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ తో కూడిన ఏర్పాట్లు చేశారు. అలాగే, పారిశుధ్యం, భద్రత, బారికేడింగ్, వైద్య శిబిరాలు, మజ్జిగ, తాగునీరు, భోజనం లాంటి ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేస్తుంది. మొత్తం 7 వేల మందితో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు సినిమా వార్తలు